Top
logo

వైద్య కళాశాల స్థలం పరిశీలించిన మంత్రులు

Highlights

పాడేరు: పాడేరులో వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యటించారు. పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్మించబోయే వైద్య...

పాడేరు: పాడేరులో వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యటించారు. పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్మించబోయే వైద్య కళాశాల స్థలాన్ని పరిశీలించారు. సీఎం జగన్ ఆదేశాలతో వైద్య కళాశాల కోసం పాలిటెక్నిక్ కాలేజీ మైదానంలో 35 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఎంత విస్తీర్ణంలో ఏయే భవనాలు రానున్నాయో అధికారులు మంత్రికి వివరించారు. సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో కళాశాల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. వచ్చే ఆగస్టులో టెండర్లు పిలిచి నిర్మాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. మంత్రి ఆళ్ల నానితో పాటు పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. 


Next Story