కార్మిక శాఖ మంత్రి పై తెదేపా చినరాజప్ప ఫైర్

తూర్పుగోదావరి -రాజమండ్రి - పెద్దాపురం

- తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రెస్ మీట్ కామెంట్స్

- కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఫైర్

- ఇఎస్ ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జయరామ్ ఇప్పడు మరో భూ కుంభకోణానికి తెరలేపారు.

- ఇట్టినా కంపెనీ లావాదేవీలతో సంబంధం లేని మంజునాధ్ ను అడ్డం పెట్టుకుని మంత్రి జయరాం ఆ కంపెనీ భూములను తన కుటుంబ సభ్యుల పేర అక్రమంగా బదలాయించుకున్నారు.

- తమకు భూములు విక్రయించేందుకు ఇట్టినా కంపెనీ యాజమాన్యం అంగీకరించినట్టు కంపెనీ బోర్డు తీర్మానాలు సృష్టించారు.

- ల్యాండ్ సీలింగ్ నిబంధనలతో బినామీల పేరుతో 115 ఎకరాలు భూమిని, కుటుంబ సభ్యుల పేరున 92 ఎకరాల భూమిని మొత్తం 203 ఎకరాలను ఈఏడాది మార్చి2న ఇట్టినా కంపెనీ నుండి తమ వాళ్ల పేర్ల మీద రిజిష్ట్రేషన్ చేయించుకున్నారు.

- ఇట్టినా కంపెనీకి చెందిన భూమిని అక్రమంగా, దౌర్జన్యంగా మంత్రి కుటుంబ సభ్యులు స్వాధీనం చేసుకున్నారు

- బదలాయించుకున్న అక్రమభూములపై వ్యవసాయ రూణాలను తీసుకునేందుకు కర్నూలు జిల్లా కో-అపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ధరఖాస్తుకున్నారు

- ఈ భూములు కొనుగోలు వ్యవహారంలో మాంత్రి జయరాం ప్రమేయం తదితర అంశాలపై సిబిఐ విచారణ జరిపించాలి


Show Full Article
Print Article
Next Story
More Stories