Top
logo

నేడు రానున్న శ్రామిక్ రైలు, ముంబై నుంచి వెయ్యి మంది రాక

Highlights

జగిత్యాల: ముంబైలో ఉన్న తెలంగాణకు చెందిన వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన శామిక్ రైలు శనివారం ఉమ్మడి జిల్లాకు...

జగిత్యాల: ముంబైలో ఉన్న తెలంగాణకు చెందిన వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన శామిక్ రైలు శనివారం ఉమ్మడి జిల్లాకు చేరుకోనుంది. జగిత్యాల లింగంపేట రైల్వే స్టేషన్ లో ఆయా ప్రాంతాలకు చెందిన వారు దిగడం కోసం నిలుపనున్నారు. జగిత్యాలలో వందమంది దిగుతున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా గ్రామంలో డప్పు చప్పుళ్ళతో గ్రామస్తులు ఎవరు కూడా రైల్వే స్టేషన్ ప్రాంతపరిధికి రావద్దని, బయట తిరగవద్దని అధికారులు గ్రామస్థులకు అప్రమత్తం చేశారు. కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. 

 

Next Story