వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..

- వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, పశ్చిమబెంగాల్ లమధ్య తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది....

- దీనికి అనుబంధం గా 7.5కిమీ ఎత్తున ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది...

- దీని ప్రభావం వల్ల ఉత్తర తెలంగాణ ,ఈశాన్య తెలంగాణ జిల్లాలో,ఉత్తర కోస్తా లో ఈరోజు ,రేపు ఒకటి రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...

- రాగల మూడు రోజుల పాటు తెలంగాణ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది...

- ఉత్తర,దక్షిణ కోస్తాలో ఈరోజు ,రేపు ఒకటి రెండు చోట్లా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది...

- రాయలసీమ లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది...

- ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...

- హైదరాబాద్ లో తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్లా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది...

- జూన్ 1 నుండి ఈరోజు వరకు నైరుతి రుతుపవనాలు కాలంలో తెలంగాణ లో సాధారణం కంటే 17 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది....

- ఇందులో అత్యధికం వా జోగులంబ జిల్లాలో 121 శాతం ,వనపర్తి లో 117 శాతం సాధారణం కన్నా అత్యధికంగా నమోదైంది. అత్యల్పం నిర్మల్ జిల్లాలో సాధారణం కన్నా 20 శాతం తక్కువగా నమోదైనది..

- కోస్తాంధ్ర లో సాధారణం కన్నా 29 శాతం ఎక్కువగా నమోదుకగా ఇందులో నెల్లూరు లో సాధారణం కన్నా 98 శాతం ఎక్కువగా నమోదయింది. శ్రీకాకుళం లో సాధారణ కన్నా 20 శాతం తక్కువగా నమోదైంది..

- రాయలసీమ లో సాధారణం కన్నా 126 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఇందులో అత్యధికం గా అనంతపురం లో 158 శాతం సాధారణం కన్నా అధికంగా నమోదైంది...

Show Full Article
Print Article
Next Story
More Stories