Top
logo

అనాధ బాలికలకు సాయం అందిస్తున్న దాతలు

Highlights

సంతబొమ్మాళి: మండలం నౌపడలో తల్లిదండ్రులు కోల్పోయి అనాధలైన బాలికలు స్వాతి, పల్లవిలకు సాయం అందించడానికి పలువురు...

సంతబొమ్మాళి: మండలం నౌపడలో తల్లిదండ్రులు కోల్పోయి అనాధలైన బాలికలు స్వాతి, పల్లవిలకు సాయం అందించడానికి పలువురు స్పందిస్తూ ముందుకు వస్తున్నారు. ఈ మేరకు ఆదివారం నౌపడకు చెందిన కళింగ కోమట్ల సంఘం చైర్మన్ వరాహ నరసింహ మూర్తి, వైస్ ప్రెసిడెంట్ కొంచాడ దుర్గారావు, కళింగ కోమట్ల సంఘం జిల్లా నెంబర్ దుంప మోహన్ రావులు ఆ బాలికలకు15,000 రూపాయలు అందజేశారు. అలాగే శ్రీకాకుళంకు చెందిన జీల్ ఫౌండేషన్ నిత్యావసర సరుకులు, బియ్యం అందించారు.


Next Story