ఇది జ‌గ‌న్ ఘ‌న‌ విజ‌యం: పండుల రవీంద్ర బాబు

కాకినాడ: మాజీ ఎంపి ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు కామెంట్స్..

- అధికార వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదించడం శుభ సూచికం..

- రాష్ట్ర పునర్విభజన చట్టం సమయంలో ఏపీలో అధికార వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది..

- దాన్ని చంద్రబాబు పక్కన పడేసి పాఠశాలలను ఏలా నడపాలో తెలియని నారాయణ ను రాజధాని కమీటీ ఛైర్మన్ గా పెట్టారు..

- నారాయణ ద్వారా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేందుకు గుంటూరు - విజయవాడ మధ్య అమరావతిని రాజధానిగా పెట్టారు..

- అమరావతి ప్రాంతంలో భూముల తవ్వతుంటే నల్లటి సారవంతైన మట్టిని చూశా..

- అటువంటి మట్టిని చూస్తే భూదేవి చూసినట్లుగా రైతు పులకించిపోతాడు..

- అలాంటి భూదేవి గర్భాన్ని తవ్వి రాజధాని నిర్మిస్తే చంద్రబాబు కు భూదేవి శాపం తగులుతుందని నాకు చాలా మంది చెప్పారు..

- రాజధాని భవనాల పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ తయారు చేసి దాన్ని సినిమా దర్శకుడు తో అప్రూవ్ చేయించారు..

- అందుకే ప్రజలు చంద్రబాబు కు తగిన తీర్పు ఇచ్చారు..

- వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే రాజధాని పెద్ద మోసమని అధికార వికేంద్రీకరణ పై చారిత్మక నిర్ణయం తీసుకున్నారు..

- అధికార వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోడం కోసం చంద్రబాబు ఒక డ్రామా కంపెనీనే నడిపారు..

- కాని న్యాయానికి ఎప్పుడు మంచే జరుగుతుంది..

- సిఎం జగన్ వెనుక దేవుడు ఉన్నాడు.. ఆ దేవుడే సహయ పడతాడు అని చెప్పడానికి మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదమే ఒక ఉదాహరణ..

- సిఎం జగన్ కు వ్యక్తిగతంగా ఇది ఒక పెద్ద విజయం.

Show Full Article
Print Article
Next Story
More Stories