Top
logo

ఉండబండలో నిరాడంబరంగా భద్రకాళి సమేత వీరభద్ర స్వామి క‌ల్యాణం

Highlights

విడపనకల్లు : విడపనకల్లు మండలం ఉండబండలో శ్రీ వీరభద్రస్వామి వారి ఉత్సవాల వేడుకలు నిరాడంబ‌రంగా జ‌రిగాయి. కరోనా...

విడపనకల్లు : విడపనకల్లు మండలం ఉండబండలో శ్రీ వీరభద్రస్వామి వారి ఉత్సవాల వేడుకలు నిరాడంబ‌రంగా జ‌రిగాయి. కరోనా వైరస్‌ కారణంగా ఈ సారి రథోత్సవం రద్దు చేశారు. ఏటా అంగరంగ వైభవంగా జరిగే కల్యాణోత్సవం ఈసారి భక్తజనం లేకుండానే శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి వారికి సాదాసీదాగా నిర్వ‌హించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం కమిటీ సభ్యులు స్వామివారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. కేవలం అర్చకుల సమక్షంలో స్వామివారి కల్యాణం జ‌రిగింది.Next Story