రోగుల పట్ల నిర్లక్ష్యం వద్దు: జాయింట్ కలెక్టర్

అనంతపురం: నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చే రోగుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం చేయరాదని, జాయింట్ కలెక్టర్ ( గ్రామ /వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) డా.ఏ.సిరి ఆదేశించారు. శనివారం నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పలు విభాగాలను జెసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఏ సమయంలో ఏ పేషెంట్ వచ్చినా వారికి గైడ్ చేయాలని, రాత్రి సమయంలో ఎవరు వచ్చినా ఆస్పత్రిలో ఏ విభాగం ఎక్కడ ఉంది, స్ట్రెచర్స్ ఎక్కడ ఉన్నాయి, ఓపి ఎక్కడ ఉంది, క్యాజువాలిటీ వార్డు ఎక్కడ ఉంది అనే విషయాలను పేషెంట్లకు చెప్పేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.

రాత్రిపూట ఆసుపత్రికి వచ్చే వారిని జాగ్రత్తగా చూసుకోవాలని, షిఫ్ట్ ల ప్రకారం సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో జాగ్రత్తగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ ఆర్ఎంఓ విజయ, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 



Show Full Article
Print Article
Next Story
More Stories