Top
logo

కరోనా సేవలకు సమరసత పురస్కారం అందుకున్న డి.హెచ్.వీ.సాంబశివరావు

Highlights

పోలవరం: జిల్లాలో లాక్ డౌన్ విధించింది మొదలు నిరంతరాయంగా నిరుపేదలు, దివ్యాంగులు ,అనాధలు, వలస కూలీలు, మూగజీవాలకు ...

పోలవరం: జిల్లాలో లాక్ డౌన్ విధించింది మొదలు నిరంతరాయంగా నిరుపేదలు, దివ్యాంగులు ,అనాధలు, వలస కూలీలు, మూగజీవాలకు రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రoట్ తెలుగు - రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి డి హెచ్ డి హెచ్ వి సాంబశివరావు సేవలందిస్తున్నారు.

- అన్నదానం, వస్త్రదానం, ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

- ఈ సేవలను గుర్తించిన ప్రముఖ ఆధ్యాత్మిక, ధార్మిక సేవా సంస్థ సమరసత సేవా ఫౌండేషన్ కరోనా సేవా పురస్కారాన్ని అందజేసింది.

- సమరసత రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఐఏఎస్ డాక్టర్ దాసరి శ్రీనివాసులు ఈ పురస్కారానికి సాంబ ను ఎంపిక చేశారు.ఫౌండేషన్ కాకినాడ డివిజన్ ప్రతినిధులు పడాల రఘు, కాదా సత్యనారాయణ, టి ఆదిలక్ష్మి , భాజపా పూర్వాధ్యక్షులు వై మాలకొండయ్య తదితరులు బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.

- సమరసత పురస్కారాన్ని అందుకున్న సాంబశివరావును రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రoట్, బ్రాహ్మణ మహాసేన, దేవాదాయ శాఖ ఈవోలు, సిబ్బంది, అర్చక, పురోహితులు, వేదపండితులు ఘనంగా అభినందించారు.
Next Story