Top
logo

నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి

Highlights

రాజంపేట: నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి నిరుపేదలను ఆదుకునేందుకు మాజీ శాసనసభ్యులు రోటరీ క్లబ్ అధ్యక్షులు...

రాజంపేట: నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి నిరుపేదలను ఆదుకునేందుకు మాజీ శాసనసభ్యులు రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథరెడ్డి, హ్యూమన్ రైట్స్ జాతీయ చైర్మన్ ఆరీఫ్ ఖలీల్ నేతృత్వంలో పట్టణ కేంద్రంలోని హ్యూమన్ రైట్స్ కార్యాలయంలో నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగానే కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు పోలా శ్రీనివాసరెడ్డి. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లారెడ్డి . డి సి ఎం ఎస్ చైర్మన్ దండు గోపి. హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు సుకుమార్, రాజంపేట చైర్మన్ బాబ్జాన్. దావూద్. సులేమాన్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.Next Story