జీడి పంట వేసిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి.. పవన్ కళ్యాణ్..

- ఈ యేడాది కరోనా ప్రభావంతో జీడి పంట మీద ఆధారపడ్డ రైతులు తీవ్ర నష్టాల బారినపడ్డారు..

- తీరప్రాంత జిల్లాల్లో సుమారు లక్ష హెక్టార్లలో ఈ పంట ఉంది.

- బస్తా జీడి పిక్కల ధర గతేడాది రూ.12 వేలు – రూ.14 వేల మధ్య ఉంటే ఈ యేడాది రూ.8 వేలు మాత్రమే పలుకుతోందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది...

- శ్రీకాకుళం జిల్లాలోని జీడి మామిడి రైతులు తాము ఏ విధంగా నష్టాల పాలవుతున్నదీ, ఎలా అప్పుల పాలవుతున్నదీ జనసేన దృష్టికి తీసుకు వచ్చారు...

- జీడి రైతుల సాగు ఖర్చులు నిమిత్తం బ్యాంకుల నుంచి రుణ సదుపాయం అందడం లేదు...

- దళారుల నుంచే అప్పులు చేసి చివరకు వాళ్ళకే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది...

- ఫలితంగా రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. జీడి పంట ప్రభుత్వం నిత్యావసర సాగు కాదని చెబుతూ మద్దతు ధర ప్రకటించకపోవడం సరికాదు..

- పొగాకు వంటి వాణిజ్య పంటలకు సంబంధిత బోర్డులు ఏర్పాటు చేసి వాటి ద్వారా సంబంధిత రైతులు నుండి కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం జీడి పంట కొనుగోలు విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించాలి...

- బస్తాకు రూ.15వేలు గిట్టుబాటు ధర ప్రకటిస్తే సంబంధిత రైతులకు ఊరట లభిస్తుంది...

- తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించడంతోపాటు, సేంద్రీయ ఎరువులను అందుబాటు ధరలకు సరఫరా చేయాలి...

- పంట నిల్వకు అవసరమైన గిడ్డంగులను ప్రభుత్వం నిర్మిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది...

- ఈ విషయంలో ప్రభుత్వం, ఉద్యాన శాఖ తక్షణం స్పందించాలి...


Show Full Article
Print Article
Next Story
More Stories