Sukanya Samriddhi Yojana: ఇంట్లో నుంచే సుకన్య ఖాతాలో ఎంత డబ్బు జమ అయిందో తెలుసుకోవచ్చు..!

You Can Know How Much Money Is Deposited In The Sukanya Samriddhi Yojana Account From Home
x

Sukanya Samriddhi Yojana: ఇంట్లో నుంచే సుకన్య ఖాతాలో ఎంత డబ్బు జమ అయిందో తెలుసుకోవచ్చు..!

Highlights

Sukanya Samriddhi Yojana: ఆడపిల్లల సంక్షేమం, సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. అందులో సుకన్య సమృద్ధి యోజన చాలా ప్రజాదరణ పొందింది.

Sukanya Samriddhi Yojana: ఆడపిల్లల సంక్షేమం, సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. అందులో సుకన్య సమృద్ధి యోజన చాలా ప్రజాదరణ పొందింది. తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజన కింద 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల పేరు మీద ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు. విశేషమేమిటంటే సుకన్య సమృద్ధి యోజన ఖాతా 21 ఏళ్లలో మెచ్యూర్‌ అవుతుంది. అయితే ఇందులో పెట్టుబడి పెట్టాల్సింది 15 ఏళ్లు మాత్రమే.

సుకన్య సమృద్ధి యోజనలో హామీతో కూడిన వడ్డీతో పాటు, చక్రవడ్డీ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంపై 8 శాతం వడ్డీ లభిస్తోంది. ఇందులో సంవత్సరానికి కనిష్టంగా రూ.250 డిపాజిట్ చేయవచ్చు. గరిష్ట మొత్తం రూ.1.5 లక్షలు చేయవచ్చు. మీరు మీ కుమార్తె జన్మించిన వెంటనే సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరిస్తే 21 సంవత్సరాల తర్వాత మీకు భారీ మొత్తం లభిస్తుంది. తద్వారా మీ కుమార్తె తదుపరి చదువులు చదవగలుగుతుంది. లేదా ఈ మొత్తం మీ కుమార్తె వివాహానికి ఉపయోగపడుతుంది.

మీరు మీ కుమార్తె పేరు మీద అకౌంట్‌ ఓపెన్‌ చేయాలంటే బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లాలి. మీరు ఇప్పటికే ఖాతా తెరిచి, ప్రతి సంవత్సరం జమ చేస్తుంటే మీ కుమార్తె పేరు మీద ఖాతాలో ఎంత మొత్తం జమ అయ్యిందో ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఇందుకోసం కింది ప్రక్రియను అనుసరిస్తే సరిపోతుంది.

సుకన్య సమృద్ధి యోజన బ్యాలెన్స్‌ ఎలా చెక్‌ చేయాలి..?

1. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో సుకన్య సమృద్ధి యోజన బ్యాలెన్స్‌ని తనిఖీ చేయవచ్చు. దీని కోసం ముందుగా బ్యాంకు నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఉపయోగించాలి. వినియోగదారు పేరు, పాస్‌వర్డ్ సాయంతో నెట్ బ్యాంకింగ్ యాప్‌కి లాగిన్ కావాలి. తర్వాత డ్యాష్‌బోర్డ్‌లో ఇప్పటికే ఉన్న మీ అన్ని ఖాతాల జాబితాను చూస్తారు.

2. ఖాతా స్టేట్‌మెంట్ ఆప్షన్‌ ఎడమ వైపున కనిపిస్తుంది. మీరు ఆ ఎంపికపై క్లిక్ చేయాలి. వెంటనే అన్ని ఖాతాల జాబితా కనిపిస్తుంది. ఇప్పుడు సుకన్య ఖాతా నంబర్‌పై క్లిక్ చేయాలి. తర్వాత కరెంట్ బ్యాలెన్స్ కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories