'దీవాళి విత్ మి' సేల్.. 1 రూపాయితో స్మార్ట్‌ఫోన్, టీవీ కొనుగోలు చేసే అవకాశం

దీవాళి విత్ మి సేల్.. 1 రూపాయితో స్మార్ట్‌ఫోన్, టీవీ కొనుగోలు చేసే అవకాశం
x
Highlights

రాబోయే పండగ సీజన్ సందర్బంగా వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ లలో ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి మొబైల్ ఫోన్ కంపెనీలు..

రాబోయే పండగ సీజన్ సందర్బంగా వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ లలో ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి మొబైల్ ఫోన్ కంపెనీలు. ఈ క్రమంలో షియోమి తన 'దీవాళి విత్ మి' సేల్ ను అందరికంటే కాస్త ముందుగా ప్రకటించింది. ఈ అమ్మకం అక్టోబర్ 16 న ప్రారంభం అవుతుందని కంపెనీ తెలిపింది. సేల్స్ అధికారిక ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం మి.కామ్‌లో జరుగుతుందని పేర్కొంది. అయితే గోల్డ్, ప్లాటినం మరియు డైమండ్ విఐపి సభ్యుల కోసం ఈ అమ్మకం ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ 15 నే ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఈ అమ్మకం కోసం షియోమి యాక్సిస్ బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఈ బ్యాంకుల వినియోగదారులకు డిస్కౌంట్ తోపాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు లభిస్తాయి. ఈ సమయంలో కంపెనీ తయారు చేసిన స్మార్ట్‌ఫోన్లు, ఉపకరణాలను తక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు తెలిపింది. ఇక మి 10 టి, మి 10 టి ప్రో స్మార్ట్‌ఫోన్‌లను ముందుగానే విడుదల చేయనుంది.

అక్టోబర్ 16 నుండి 21 వరకు అంటే 6 రోజులు అమ్మకం జరుగుతుంది. ఈ సమయంలో, యాక్సిస్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ వినియోగదారులకు క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేసేవారికి 1000 రూపాయల తక్షణ తగ్గింపు లభిస్తుంది. మొదటి రోజు నుంచి గోల్డ్, డైమండ్, ప్లాటినం విఐపిఎ సభ్యులకు ఈ అమ్మకం ప్రయోజనం లభిస్తుందని కంపెనీ ఇండియా హెడ్ మను కుమార్ జైన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ను ముందుగానే ఒక రూపాయి చెల్లించి కొనుగోలు చేసే ఫ్లాష్ సేల్‌ను కూడా అందుబాటులోకి తెస్తుంది. దీంతో ఒక రూపాయికే 17 వేల ధర గల నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్, 14 వేల ధర గల 4ఎ 32 ఇంచెస్ టీవీని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories