World Bank Warning: 2030 నాటికి ఉద్యోగాలు పెరిగినా..వాతావరణ రిస్క్ ఉంది.. భారత్‌కు వరల్డ్ బ్యాంక్ హెచ్చరిక

World Bank Warning
x

World Bank Warning: 2030 నాటికి ఉద్యోగాలు పెరిగినా..వాతావరణ రిస్క్ ఉంది.. భారత్‌కు వరల్డ్ బ్యాంక్ హెచ్చరిక

Highlights

World Bank Warning: అకాల వర్షాలు, వరదలు, వేడి గాలులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఎమకలను విరిచే చలి..ఈ మధ్యకాలంలో వాతావరణం సంవత్సరమంతా ఇలానే తీవ్రరూపం దాల్చి విశ్వరూపం చూపిస్తుంది.

World Bank Warning: అకాల వర్షాలు, వరదలు, వేడి గాలులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఎమకలను విరిచే చలి..ఈ మధ్యకాలంలో వాతావరణం సంవత్సరమంతా ఇలానే తీవ్రరూపం దాల్చి విశ్వరూపం చూపిస్తుంది. దీనికి కారణం వాతావరణ మార్పులు. అయితే, 2030 నాటికి దేశంలో ఉద్యోగాలు పెరిగినా, వాతావరణ మార్పుల వల్ల తీవ్రంగా ఆర్ధిక నష్టం జరుగుతుందని భారత్‌ను వరల్డ్ బ్యాంక్ హెచ్చరించింది. దీని కోసం ఇప్పటినుంచే భవిష్యత్తుకు రక్షణ మార్గాన్ని చూడాలని సూచించింది.

భారత్ దేశ నగరాల్లో వాతావరణ మార్పులు భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావం చూపవచ్చని ప్రపంచ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా 70శాతం ఉద్యోగాలు దేశంలో ఏర్పడతాయి. కానీ వరదలు, ఉష్ణోగ్రతలు, అనూహ్య వర్షాలు...తీవ్రత బాగా పెరిగిపోతుంది. దీనివల్ల సుమారు 40వేల కోట్లునష్టం జరిగే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ చెబుతోంది.

ప్రస్తుతం వాతావరణంలో విపరీతమైన వాతావరణ మార్పులు కలుగుతున్నాయి. అప్పుడే వర్షాలు, అప్పుడే ఎండలు, అప్పుడే చలి. ఏ కాలంలో ఏది తీవ్రతగా ఉంటుందో ఎవరికీ తెలియదు. అకస్మాత్తు పరిణామాలతో ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇవి నేరుగా ఉద్యోగాలు, మౌలిక వసతులు, ఆర్ధిక వ్యవస్థపై పడి.. తీవ్రంగా వాటిని దెబ్బతీస్తాయని వరల్డ్ బ్యాంక్ హెచ్చరిస్తోంది.

అంతేకాదు, ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తున్న దాని ప్రకారం చూస్తే 2050 నాటికి వచ్చే విపత్తులను ఎదుర్కోవడానికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అవసరం పడతాయి. అదేవిధంగా 2070 నాటికి 10 ట్రిలియన్ డాలర్లు దాటవచ్చని నివేదిక చెబుతోంది. నగరాల్లో ఉద్యోగాలు పెరుగుతున్న సమయంలో మరోపక్క ఈ విపత్తులు నగరాలను ఇబ్బందులకు గురిచేస్తాయి. అందుకే ఇప్పటినుంచే నగరాల్లో వాతావరణ మార్పులపై దృష్టి పెట్టాలని సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories