Rs 2000 Notes Withdrawn: నేటి నుంచి 2వేల నోట్లు ఉపసంహరణ

Withdrawal of 2 Thousand Notes From Today
x

RS 2000 Notes Withdrawn: నేటి నుంచి 2వేల నోట్లు ఉపసంహరణ

Highlights

Rs 2000 Notes Withdrawn: రోజుకు రూ.20వేల చోప్పున 10 నోట్లు మార్చుకునే అవకాశం

Rs 2000 Notes Withdrawn: 2వేల రూపాయల నోటు ఉపసంహరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఎవరైనా, ఏ బ్యాంకుకైనా వెళ్లి, తమ దగ్గరున్న 2వేల రూపాయల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. సెప్టెంబర్ 30 వరకు ఈ ప్రక్రియకు గడువు విధించింది ఆర్బీఐ. దీని కోసం ఎవ్వరూ ఎలాంటి గుర్తింపు చూపించాల్సిన అవసరం లేదని... ఆధార్ లేదా పాన్ కార్డ్ నంబర్ చెప్పాల్సిన అవసరం లేదని ఆర్బీఐ వెల్లడించింది.

20వేల రూపాయల వరకు 2వేల రూపాయల నోట్లను మార్పిడి చేసుకునేందుకు ఎలాంటి రూల్స్ లేవని ఆర్బీఐ వెల్లడించింది. 50వేల కంటే ఎక్కువ మొత్తాన్ని మార్పిడి చేసుకోవాలన్నా, బ్యాంక్‌లో డిపాజిట్‌గా వేయాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరి చేసింది.

2 వేల రూపాయల నోట్లు ఎన్ని వచ్చినా వాటితో మార్చేందుకు 500, 200, 100 రూపాయల నోట్లు అన్ని బ్యాంకుల్లో ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. ప్రతి బ్యాంక్‌లో చిల్లర నిల్వ ఉందని, 2వేల రూపాయల నోట్లు ఎన్ని వచ్చినా, అన్నింటికీ సరిపడా 500, 200 రూపాయల నోట్లు ఇస్తారని తెలిపింది. ఒకవేళ మార్పిడి ఇష్టం లేని వాళ్లు, నేరుగా తమ ఎకౌంట్లలో డబ్బును జమ చేసుకోవచ్చని కూడా సూచిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories