Why Stock Market Crashing: కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్... లక్షల కోట్ల సంపద ఆవిరి


Why Stock Market Crashing: కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్... లక్షల కోట్ల సంపద ఆవిరి
Why stock market falling in India: ఇంతకీ స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతోంది? మార్కెట్స్ ఎందుకు కుప్పకూలుతున్నాయి? ఈ డౌన్‌ఫాల్‌కు బ్రేకులు పడేదెప్పుడు ? ఇదే నేటి ట్రెండింగ్ స్టోరీ. డోనల్డ్ ట్రంప్ టారిఫ్స్ బెదిరింపులు ఎగుమతులు, దిగుమతుల వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
Why stock market is crashing in India: ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో మరోసారి తీవ్రమైన డౌన్‌ఫాల్ కనిపిస్తోంది. బీఎస్ఈ, నిఫ్టీ సూచీలు వరుసగా కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ వరుసగా 9 సెషన్లలో 3000 పాయింట్స్ నష్టపోయింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే మదుపర్లను ఈ మార్కెట్ ఫాల్ నిద్ర కరువయ్యేలా చేస్తోంది. మరీ ముఖ్యంగా స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే మదుపర్లకు స్టాక్ మార్కెట్ పట్టపగలే చుక్కలు చూపిస్తోంది.
రాధాకృష్ణ దమాని లాంటి తలపండిన ఇన్వెస్టర్లకే స్టాక్ మార్కెట్ పల్స్ దొరకడం లేదు. ఇంతకీ స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతోంది? మార్కెట్స్ ఎందుకు కుప్పకూలుతున్నాయి? ఈ డౌన్‌ఫాల్‌కు బ్రేకులు పడేదెప్పుడు ? ఇదే నేటి ట్రెండింగ్ స్టోరీ.
2019 ఏప్రిల్ 30 నుండి మే 13 మధ్య స్టాక్ మార్కెట్ వరుసగా కొలాప్స్ అయింది. నిఫ్టీ వరుసగా 9 సెషన్స్ కుప్పకూలింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను భారీ నష్టాల్లో ముంచెత్తుతోంది. ఆగకుండా పడిపోతున్న మార్కెట్ మదుపర్లకు దడ పుట్టిస్తోంది.
వాస్తవానికి గత ఏడాది సెప్టెంబర్ 27న సెన్సెక్స్ గరిష్టంగా 85,978 మార్క్ తాకింది. అదే టైమ్‌లో నిఫ్టీ కూడా 26 వేల మార్క్ దాటింది. కానీ ఆ తరువాతే విదేశీ సంస్థాగత మదుపర్లు తమ ఇన్వెస్ట్‌మెంట్‌ను విత్‌డ్రా చేసుకోవడం మొదలైంది. అప్పటి నుండి స్టాక్ మార్కెట్లో పతనం మొదలైంది.
ఒకానొక దశలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సెన్సెక్స్ 70 వేల దిగువకు, నిఫ్టీ 21000 కనిష్టానికి పడిపోయాయి. గతేడాది సెప్టెంబర్ చివర్లో సూచీలు తీవ్రంగా నష్టపోయాయి. పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులే అందుకు కారణంగా మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి. ఆ తరువాత సూచీలు కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చి ఫిబ్రవరి 4 నాటికి కొంత బలపడ్డాయి. మార్కెట్ గ్రాఫ్ మళ్లీ పైకి వెళ్తుండటం చూసి ఇన్వెస్టర్లలో మళ్లీ ఆశలు చిగురించాయి.
కానీ ఆ తరువాతే మార్కెట్లో మరో బ్లడ్‌బాత్ మొదలైంది. సూచీలు వరుసగా 9 సెషన్స్ నష్టపోయాయి. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 75967 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 22945 వద్ద ఉంది. ఈ డౌన్‌ఫాల్ ట్రెండ్ మదుపర్లను కోలుకోలేని దెబ్బ కొడుతోంది. ఫిబ్రవరి 4 నుండి ఇప్పటికే సెన్సెక్స్ 3000 పాయింట్స్ నష్టపోయింది. దీంతో స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అన్నీ కలిపి మొత్తం 29 లక్షల కోట్ల సొమ్ము ఆవిరైపోయింది.
ఎక్కువగా నష్టపోయిన కంపెనీలు
మహింద్రా అండ్ మహింద్రా, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టి కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ క్షీణించడం, విదేశీ మదుపర్లు భారీ ఎత్తున తమ వాటాలను విక్రయించడం వంటివి ఈ డౌన్ ఫాల్‌కు ఆజ్యం పోశాయి.
అధికంగా నష్టపోయిన ఇన్వెస్టర్స్
రాధాకృష్ణ దమాని గత నాలుగు నెలల కాలంలోనే ఏకంగా రూ. 64,000 కోట్లు నష్టపోయారు.
రాకేశ్ ఝుంఝన్‌వాలా కుటుంబం ఒక్క చివరి రెండు సెషన్లలోనే ఏకంగా 1600 కోట్లు నష్టపోయారు. మొత్తం 18 శాతం నష్టపోయిన తరువాత ఇప్పుడు ఆ కుటుంబం ఇన్వెస్ట్‌మెంట్ క్యాపిటల్ రూ.59,709 కోట్లుగా ఉంది.
హేమేంద్ర కొఠారి 29 శాతం నష్టపోయారు.
కొఠారి 18 శాతం నష్టపోయారు.
విజయ్ కేడియా రూ. 505 కోట్లు నష్టపోయారు
ఆకాశ్ బన్సాలీ 16 శాతం నష్టపోయారు.
ఆశిష్ ధవన్, నిమేష్ షా 19-22 శాతం నష్టపోయారు.
కార్పొరేట్ లాభాల్లో కనిపించని గ్రోత్
అంతేకాకుండా మూడో త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీలు వెల్లడించిన ఆర్థిక ఫలితాల్లో కేవలం 7 శాతం వృద్ధి మాత్రమే కనిపించింది. 10 శాతం కంటే తక్కువ స్థాయిలో కనిపించే లాభాలు మార్కెట్‌ను లాభాల బాట పట్టించలేవని జియోజిత్ ఫినాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటెజిస్ట్ వి.కె. విజయ్ కుమార్ చెబుతున్నారు. మార్కెట్ వరుసగా కుప్పకూలడానికి ఇది కూడా మరో కారణమైందనేది వారి అభిప్రాయం.
1.16 లక్షల కోట్ల విలువైన షేర్స్ విక్రయం
సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 14 నాటికే విదేశీ సంస్థాగత మదుపర్లు 1 లక్ష 16 వేల కోట్ల విలువైన షేర్స్ విక్రయించారు. ఇది స్టాక్ మార్కెట్లో మరింత ఒత్తిడికి దారితీసింది. ఒక్క 2024 ఏడాదిలోనే విదేశీ మదుపర్లు మొత్తం 3 లక్షల కోట్ల విలువైన షేర్స్ అమ్మేసుకున్నారంటే ఇక పరిస్థితి ఏ రేంజులో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
డోనల్డ్ ట్రంప్ టారిఫ్స్ బెదిరింపులు ఎగుమతులు, దిగుమతుల వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఒక తాజా అధ్యయనం ప్రకారం భారత్ ఎగుమతి వ్యాపారంలో అమెరికాపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దీంతో అంతర్జాతీయంగా, ముఖ్యంగా అమెరికా వైపు నుండి భారత్‌కు ఏ చిన్న పరిణామం చోటుచేసుకున్నా అది ఇండియన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌పై భారీ ప్రభావం చూపిస్తోంది.
విదేశీ మదుపర్లు ఇండియన్ స్టాక్ మార్కెట్లో షేర్స్ అమ్ముకోవడానికి అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తలెత్తుతుండటం ఒక కారణం. మరోవైపు డాలర్ విలువ బలపడుతూ రూపాయి విలువ క్షీణిస్తుండటం మరో కారణంగా మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఏదేమైనా ఒకప్పుడు విదేశీ మదుపర్లు షేర్స్ అమ్ముకుంటుంటే ఇండియాలో కొత్త మదుపర్లు వాటిని కొనేందుకు చక్కటి అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు అదే పరిణామం ఇండియాలో మదుపర్లకు చుక్కలు చూపెడుతోంది.
ఇలా ఇంకెంత కాలం?
ఇదే విషయమై ప్రముఖ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ బ్రహ్మచారి మాట్లాడుతూ ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్ ఇలా వరుసగా 9 రోజుల పాటు పడిపోవడం ఇదే తొలిసారి అని అన్నారు. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ మినహాయిస్తే మిగతా సూచీలన్నీ 10 నుండి 32 శాతం కరెక్ట్ అయ్యాయన్నారు. అత్యధిక శాతం స్టాక్స్ 200 డైలీ మూవింగ్ యావరేజ్ దిగువకు పడిపోయాయని తెలిపారు. బేరిష్ మార్కెట్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇదే ఉదాహరణ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కరెక్షన్ ఇంకా ఎంత కాలం ఉంటుంది? ఎంతమేరకు కరెక్ట్ అవుతుందనేది చెప్పలేమన్నారు.
Also watch this video: Jayalalithaa's Seized Assets: వేల కోట్ల ఆస్తులను ఇప్పుడేం చేస్తారు? | Trending Story

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



