IT stock crash today : సాఫ్ట్‌వేర్ కంపెనీల కొంపముంచిన AI..ఐటీ స్టాక్స్ పతనం వెనుక దిమ్మతిరిగే నిజాలు!

Stock Market Updates: భారతీయ ఐటీ దిగ్గజాలకు గురువారం 'బ్లాక్ థర్స్డే'గా మారింది. ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోవడమే కాకుండా, ఐటీ రంగం భవిష్యత్తుపై కొత్త ఆందోళనలు మొదలయ్యాయి.

Ganesh
Published on: 12 Feb 2026 6:20 PM IST
IT stock crash today : సాఫ్ట్‌వేర్ కంపెనీల కొంపముంచిన AI..ఐటీ స్టాక్స్ పతనం వెనుక దిమ్మతిరిగే నిజాలు!
X

IT stock crash today : సాఫ్ట్‌వేర్ కంపెనీల కొంపముంచిన AI..ఐటీ స్టాక్స్ పతనం వెనుక దిమ్మతిరిగే నిజాలు!

Stock Market Updates: భారతీయ ఐటీ దిగ్గజాలకు గురువారం 'బ్లాక్ థర్స్డే'గా మారింది. ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోవడమే కాకుండా, ఐటీ రంగం భవిష్యత్తుపై కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో వంటి అగ్రశ్రేణి సాఫ్ట్‌వేర్ కంపెనీల మార్కెట్ విలువ కేవలం కొన్ని గంటల్లోనే రూ. 1,00,000 కోట్లకు పైగా పడిపోయింది.

ఒక్కరోజే లక్ష కోట్లు గోవిందా..

మార్కెట్ ప్రారంభం నుంచే ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ప్రధాన ఐటీ కంపెనీల షేర్లు 5 శాతం వరకు క్షీణించాయి.

ఇన్ఫోసిస్ (Infosys): 5.18% పతనమై రూ. 1,396 వద్దకు చేరింది.

TCS: 4.58% తగ్గి రూ. 2,776 వద్ద ట్రేడ్ అయింది.

HCL టెక్: 4.55% క్షీణించి రూ. 1,480.50 వద్ద నిలిచింది.

టెక్ మహీంద్రా & విప్రో: ఇవి కూడా 4% వరకు నష్టపోయాయి.

బుధవారం నాటికి ఈ ఐదు కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 2,47,1656 కోట్లు ఉండగా, గురువారం నాటికి అది రూ. 2,37,1285 కోట్లకు పడిపోయింది. అంటే ఇన్వెస్టర్లు సుమారు రూ. 1,00,372 కోట్లు నష్టపోయారు.

ఐటీ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి..

ఐటీ రంగం పతనానికి ప్రధానంగా "ఆంత్రోపిక్ షాక్" కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా మార్కెట్లలో భారతీయ ఐటీ కంపెనీల ADRలు (American Depository Receipts) రాత్రికి రాత్రే పడిపోవడంతో ఐటీ షేర్ల పతనానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

1. ఆంత్రోపిక్ క్లాడ్ (Anthropic Claude) ప్రభావం:

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఆంత్రోపిక్ సంస్థ తన 'క్లాడ్ కోవర్క్ ప్లగిన్‌లను' విడుదల చేసింది. ఇవి సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, లీగల్, డేటా అనలిటిక్స్ పనులను అతి తక్కువ టైంలో పూర్తి చేస్తాయి. దీనివల్ల ఐటీ కంపెనీలు అందించే సాంప్రదాయ సేవలకు గిరాకీ తగ్గుతుందనే భయం ఇన్వెస్టర్లలో స్టార్ట్ అయ్యంది.

2. AI వల్ల ఉద్యోగాలకు, ప్రాజెక్టులకు ముప్ప:

గతంలో ఏళ్ల తరబడి పట్టే 'SAP మైగ్రేషన్' వంటి పనులను ఇప్పుడు పలంటిర్ వంటి AI మోడల్స్ కేవలం వారాల్లోనే పూర్తి చేయగలవని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఐటీ కంపెనీల ఆదాయ వనరులైన 'శ్రమ, సమయం' (Labour Intensity & Duration) తగ్గిపోయే ప్రమాదం ఉంది. సాఫ్ట్‌వేర్ రంగంలోని విలువల గొలుసును AI ఛిన్నాభిన్నం చేస్తుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో పెరిగింది.

3. అమెరికా మార్కెట్ల ప్రభావం:

అమెరికాలో ఇన్వెస్టర్లు టెక్నాలజీ స్టాక్స్ నుంచి ఇతర రంగాలకు మళ్లుతున్నారు. అక్కడి మార్కెట్లలో వచ్చిన మార్పుల వల్ల ఇన్ఫోసిస్, విప్రో ADRలు 5% వరకు పడిపోయాయి.

నిపుణులు ఏమంటున్నారంటే..

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ మాట్లాడుతూ.. "భారతీయ ఐటీ ఇబ్బందులు ఇప్పుడప్పుడే ముగిసేలా లేవు. ఐటీ రంగం నుంచి ఇన్వెస్టర్లు ఇతర రంగాలకు షిఫ్ట్ అవుతున్నారు. ADRల పతనం దీనికి నిదర్శనం" అని అన్నారు. నిర్మల్ బాంగ్ సంస్థ విశ్లేషణ అభిప్రాయం ప్రకారం.. AI ఫౌండేషన్ మోడల్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, సాఫ్ట్‌వేర్ సేవలు అందించే కంపెనీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని చెప్పింది.

టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఐటీ కంపెనీలు కూడా తమ పనితీరును మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. లేదంటే ఏఐ వంటి ఆధునిక సాంకేతికతలు, సంప్రదాయ ఐటీ సేవల ఆదాయానికి గండికొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Ganesh

Ganesh

2022లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైఫ్ స్టైల్, బిజినెస్‌, మూవీస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా సినిమా గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story