Financial Year End 2023,24: ఒక ఆర్థిక సంవత్సరం మార్చి 31తోనే ఎందుకు ముగుస్తుంది.. కారణాలు ఇవే..!

Why a Financial Year Ends on March 31 know the Reasons
x

Financial Year End 2023,24: ఒక ఆర్థిక సంవత్సరం మార్చి 31తోనే ఎందుకు ముగుస్తుంది.. కారణాలు ఇవే..!

Highlights

Financial Year End 2023,24: మార్చి 31తో 2023, 24 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఏప్రిల్‌ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది.

Financial Year End 2023,24: మార్చి 31తో 2023, 24 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఏప్రిల్‌ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయాలు ఖర్చుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేస్తారు. వారి ఆదాయం పన్ను పరిధిలోకి వస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్వాతంత్ర్యం రాకముందు నుంచే ఇలా జరుగుతోంది. ఇప్పుడు రూ. 3 లక్షల వరకు సంపాదన పన్ను రహితం చేశారు. ఇప్పుడు రెండు పన్ను విధానాలు ఉన్నాయి. ఒకటి పాత పన్ను విధానం, రెండోది కొత్త పన్ను విధానం. పాత పన్ను విధానంలో, రూ. 2.5 లక్షల వరకు ఆదాయం పన్ను పరిధికి వెలుపల ఉండేది. కొత్త పన్ను విధానంలో, రూ. 3 లక్షల వరకు ఆదాయాలు పన్ను రహితంగా ఉన్నాయి.

1. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలనే నియమం బ్రిటిష్ కాలం నుంచి పాటిస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా అందులో ఎలాంటి మార్పులు చేయలేదు. రాజ్యాంగంలో ఆర్థిక సంవత్సరం సమయాన్ని మార్చి-ఏప్రిల్‌గా మాత్రమే నిర్ణయించారు.

2. భారతదేశం వ్యవసాయాధారిత దేశం. అందుకే పంటల చక్రాన్ని దృష్టిలో ఉంచుకుని మార్చి 31న ఆర్థిక సంవత్సర ముగింపు నిర్దేశించారు. ఈ సమయంలో కొత్త పంట వేస్తారు పాత పంటను పండించి మార్కెట్‌లో విక్రయించడం వల్ల వారికి కొంత ఆదాయం వస్తుంది.ఈ ఆర్థిక సంవత్సరంలో తదనుగుణంగా వారి లావాదేవీల ఖాతాలను సిద్ధం చేస్తారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది రైతులు మళ్లీ కొత్త పంటలను విత్తడం ప్రారంభిస్తారు.

3. చాలామందికి డిసెంబర్‌ 31న ఆర్థిక సంవత్సరం ముగింపు పలకవచ్చు కదా అని అనుమానం రావొచ్చు. వాస్తవానికి డిసెంబర్ నెల చాలా బిజీ షెడ్యూల్. అందుకే ఈ నెలలో ఆర్థిక సంవత్సర ముగింపు పెట్టలేదు. ఏప్రిల్ 1 భారతదేశంలో హిందూ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంద ని కొందరు నమ్మా రు. ఈ సమయంలో ప్రజలు తమ పని శైలిని మార్చుకుంటారు. ఆర్థిక సంవత్స రం నెలను మార్చి-ఏప్రిల్‌గా ఎందుకు నిర్ణయించారనే దాని గురించి రాజ్యాంగంలో ఎటువంటి సమాచారం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories