Aadhaar: ఆధార్‌ వ్యాలిడిటీ ముగిస్తే ఏం చేయాలి.. నకిలీదా అసలైందా ఎలా తెలుస్తుంది..?

What to Do if Aadhaar Validity Ends How to Know if it is Fake or Original
x

Aadhaar: ఆధార్‌ వ్యాలిడిటీ ముగిస్తే ఏం చేయాలి.. నకిలీదా అసలైందా ఎలా తెలుస్తుంది..?

Highlights

Aadhaar: దేశంలో ఆధార్‌ కార్డు లేనిదే దాదాపు ఏ పని జరగదనే చెప్పాలి. అత్యంత ముఖ్యమైన పత్రంగా మారిపోయింది.

Aadhaar: దేశంలో ఆధార్‌ కార్డు లేనిదే దాదాపు ఏ పని జరగదనే చెప్పాలి. అత్యంత ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాల విషయంలో, పిల్లల్ని స్కూల్‌ చేర్పించడానికి, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ వంటి పనులలో ఆధార్‌ కీలకంగా మారింది. అయితే ఆధార్‌కార్డు ఎన్నిరోజులు చెల్లుబాటులో ఉంటుంది.. అసలైన, నకిలీ ఆధార్‌ కార్డుని ఎలా గుర్తించాలి తదితర విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఆధార్‌కార్డుని ఆన్‌లైన్‌ ద్వారా చెక్‌ చేయవచ్చు. ఒక వ్యక్తికి ఆధార్ కార్డు జారీ అయితే అది జీవితాంతం చెల్లుబాటు అవుతుంది. అయితే మైనర్‌ల విషయంలో మాత్రం దీనికి లిమిట్‌ ఉంటుంది. ఐదేళ్లలోపు పిల్లల ఆధార్ కార్డు బ్లూ కలర్‌లో ఉంటుంది. దీనిని చైల్డ్ ఆధార్ కార్డ్ అంటారు. పిల్లలకి ఐదేళ్లు నిండిన తర్వాత ఆధార్ కార్డును అప్‌డేట్ చేయాలి. లేదంటే అది ఇన్‌యాక్టివ్‌గా మారుతుంది. ఇలాంటి సందర్భంలో ఆధార్ కార్డును సక్రియం చేయడానికి బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్‌ చేయాలి. తర్వాత మరొక ఆధార్ కార్డు జారీ చేస్తారు.

అలాగే 15 ఏళ్ల తర్వాత కూడా ఆధార్ కార్డును అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఆధార్ కార్డ్ యాక్టివ్‌గా ఉంటుంది సరైన సమాచారం అప్‌డేట్ అవుతుంది. అలాగే ఆధార్‌ కార్డు అసలైందా లేదా నకిలీదా కూడా చెక్‌ చేయవచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో ఒక ప్రాసెస్‌ ఉంది. దీనిద్వారా మీ ఆధార్‌ కార్డుని అందులోని సమాచారాన్ని చెక్‌ చేయవచ్చు. ఈ విధంగా ఆధార్‌కార్డుని వెరిఫై చేయండి.

1. ముందుగా ఆధార్ కార్డ్ uidai.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2. ఇప్పుడు హోమ్‌పేజీలో 'ఆధార్ సేవలపై' నొక్కి కింద వచ్చిన 'ఆధార్ నంబర్‌ని ధృవీకరించాలి' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

3. తర్వాత 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయడం వల్ల ఆధార్‌ను ధృవీకరించవచ్చు

4. ఇప్పుడు వెరిఫై బటన్‌పై క్లిక్ చేసి సమాచారం తనిఖీ చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories