Gas Cylinder Prices: యుద్ధం దెబ్బ.. త్వరలోనే భారీగా పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు ?

Gas Cylinder Prices
x

Gas Cylinder Prices: యుద్ధం దెబ్బ.. త్వరలోనే భారీగా పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు ?

Highlights

Gas Cylinder Prices: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం మీ వంటగదిపై కూడా ప్రభావం చూపించొచ్చు. మన దేశంలో ముందు ముందు ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.

Gas Cylinder Prices: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం మీ వంటగదిపై కూడా ప్రభావం చూపించొచ్చు. మన దేశంలో ముందు ముందు ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నందున సిలిండర్ రేట్లపై దాని ప్రభావం పడొచ్చు. ఎందుకంటే, మన దేశానికి వచ్చే ప్రతి 3 ఎల్పీజీ సిలిండర్లలో 2 సిలిండర్లు మిడిల్ ఈస్ట్ నుంచే వస్తున్నాయి.

ఈటీ (ఎకనామిక్ టైమ్స్) రిపోర్ట్ ప్రకారం.. అమెరికా, ఇరాన్ న్యూక్లియర్ ప్రాంతాలపై దాడులు చేయడంతో, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి ప్రాంతం అయిన వెస్ట్ ఆసియా నుంచి సరఫరా ఆగిపోతుందేమో అనే భయం పెరిగింది. గత 10 ఏళ్ళలో భారతదేశంలో ఎల్పీజీ వాడకం రెట్టింపు కంటే ఎక్కువైంది. ఇప్పుడు 33 కోట్ల ఇళ్లకు ఎల్పీజీ అందుతోంది. ఇది ప్రభుత్వ పథకాల వల్ల జరిగింది. ఈ పథకాలు ఎల్పీజీ వాడకాన్ని ప్రోత్సహించాయి. కానీ, దీని వల్ల భారతదేశం దిగుమతులపై ఆధారపడడం కూడా పెరిగింది.

మనం వాడే ఎల్పీజీలో దాదాపు 66శాతం విదేశాల నుంచే వస్తుంది. అందులో 95శాతం వెస్ట్ ఆసియా దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ నుంచి వస్తుంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారతదేశంలో ఎల్పీజీ నిల్వ కేవలం 16 రోజుల వినియోగానికి మాత్రమే సరిపోతుంది. ఈ నిల్వలు దిగుమతి టెర్మినల్స్, రిఫైనరీలు, బాట్లింగ్ ప్లాంట్లలో ఉన్నాయి.

అయితే, పెట్రోల్, డీజిల్ విషయానికి వస్తే భారతదేశం పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. మనం ఉత్పత్తి చేసే పెట్రోల్‌లో 40శాతం, డీజిల్‌లో 30శాతం బయటి దేశాలకు పంపిస్తున్నాం. ఒకవేళ అవసరం వస్తే ఈ ఎగుమతి చేసే పరిమాణాన్ని మన దేశీయ మార్కెట్‌కు మళ్ళించవచ్చు. ముడి చమురు (క్రూడ్ ఆయిల్) విషయానికొస్తే, రిఫైనరీలలో, పైప్‌లైన్‌లలో, షిప్‌లలో, నేషనల్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ (SPR) లో 25 రోజుల నిల్వ ఉంది. ఇజ్రాయిల్-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య, రిఫైనరీలు అనవసరంగా ఎక్కువ కొనుగోలు చేయలేదు. ఎందుకంటే, సరఫరా ఆగిపోయే ప్రమాదం తక్కువని వాళ్ళు అనుకుంటున్నారు.

ఇప్పుడు ఆర్డర్ చేసినా, డెలివరీ వచ్చే నెలలో లేదా తర్వాత వస్తుంది. మన దగ్గర అదనపు నిల్వ సామర్థ్యం కూడా తక్కువగా ఉంది. సరఫరాలో అంతరాయం వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ కొనుగోలు చేసి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం వేస్ట్. చమురు ధరలు పెరిగితే, రిఫైనర్ల లాభాలపై తక్కువ కాలంలో ప్రభావం పడొచ్చు. కానీ, పెట్రోల్-డీజిల్ రిటైల్ ధరలలో మార్పు వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు గత 3 సంవత్సరాలుగా పెట్రోల్ పంపు ధరలను స్థిరంగా ఉంచుతున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, వాళ్ళు అలాగే కొనసాగించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories