Business Ideas: వ్యాపారం చేయాలని ఉంది.. కానీ ఐడియాలు రావడంలేదా? ఇంట్లో పనులు చేసుకుంటూనే డబ్బు ఎలా సంపాదించాలి?

Business Ideas
x

Business Ideas: వ్యాపారం చేయాలని ఉంది.. కానీ ఐడియాలు రావడంలేదా? ఇంట్లో పనులు చేసుకుంటూనే డబ్బు ఎలా సంపాదించాలి?

Highlights

Business Ideas: మనసు ఉంటే మార్గం ఉంటుంది..ఇది ఎవరో సరదాకి అన్నది కాదు. నిజమే.. మనసుపెట్టి ఆలోచిస్తే సరైన మార్గం మనకు దొరుకుతుంది. ఉద్యోగం రావడం లేదని, ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుందని, బిజినెస్ చేయాలంటే ఏం చేయాలో తెలియకపోవడం.. ఇవన్నీ కొంతమందికి తీరని సమస్యలుగా ఉంటాయి. ఇలాంటి వారికి ఇదొక చక్కని బిజినెస్ ట్రిక్.

Business Ideas: మనసు ఉంటే మార్గం ఉంటుంది..ఇది ఎవరో సరదాకి అన్నది కాదు. నిజమే.. మనసుపెట్టి ఆలోచిస్తే సరైన మార్గం మనకు దొరుకుతుంది. ఉద్యోగం రావడం లేదని, ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుందని, బిజినెస్ చేయాలంటే ఏం చేయాలో తెలియకపోవడం.. ఇవన్నీ కొంతమందికి తీరని సమస్యలుగా ఉంటాయి. ఇలాంటి వారికి ఇదొక చక్కని బిజినెస్ ట్రిక్.

బిజినెస్ చేయాలంటే దానికి పెట్టుబడికోసం డబ్బు కావాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా చేసేందుకు రకరకాల పథకాలును తీసుకొచ్చింది. ముఖ్యంగా ముద్రా రుణాలు. గడిచిన పది సంవత్సరాలలో ఈ రుణాలు తీసుకుని కోట్ల మంది వ్యాపారాలు ప్రారంభించి తమ కాళ్లపై నిలబడ్డారు.

ముద్రా రుణం ఎలా తీసుకోవాలి?

నిరుద్యోగులు బాధపడకూడదని, వ్యాపారాల ద్వారా కూడా డబ్బులు సంపాదించి ఎవరి కాళ్లపై వాళ్లు నిలబడవచ్చనే నమ్మకాన్ని కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ముద్రా రుణాలను తీసుకొచ్చింది. ప్రభుత్వ, ప్రయివేట్ బ్యాంకులలో ఎవరైనా ఈ రుణాల కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది అప్లై చేసేముందు ఏ వ్యాపారం చేయాలి. ఎలా చేయాలి. ఎక్కడ చేయాలి. ఎంత ఖర్చు అవుతుంది? ఇలాంటి వాటిని స్పష్టంగా వివరిస్తూ ఒక ప్రాజెక్ట్ ఫైల్ తయారు చేసుకోవాలి. దీన్ని సంబంధిత బ్యాంకు అధికారి దగ్గరకు తీసుకెళితే రుణం పొందవచ్చు.

బిజినెస్ ఐడియా ఎలా ఉండాలి?

ముద్ర రుణం ద్వారా వ్యాపారం చేయాలనుకునేవారి మంచి బిజినెస్ ఐడియా ఉంటే చక్కని ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఎప్పకప్పడు ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకు వెళితే చాలా లాభాలు కూడా పొందుతారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రజలు పుడ్, బ్యూటీపైన దృష్టి పెట్టారు. అంటే రకరకాల ఆహారాలు తినడం అలాగే శరీరం, చర్మంపై శ్రద్ద పెంచుకోవడం కూడా ఎక్కువైంది. అందుకే ఇవి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఇంకా ఫుడ్ స్టాల్స్, బ్యూటీ పార్లర్స్ కు డిమాండ్ ఎక్కువ ఉంది.

ఉదాహరణకు ఏదైనా కొత్త పుడ్ బిజినెస్ చేద్దామని అనుకునేవారు నగరాలను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్కవు ప్రజలు దగ్గరగా ఉంటారు కాబట్టి వ్యాపారం సక్సెస్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నగరాలైతే ఒక రకమైన ఆహారం, పల్లెటూర్లు అయితే ఒక రకమైన ఆహారాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నగరాల్లో అయితే ఫాస్ట్ పుడ్, అదే పల్లెటూళ్లలో అయితే టిఫిన్స్, స్నాక్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. ఫాస్ట్ పుడ్ లో పిజ్జాలు, బర్గర్ లు, ప్రైడ్ చికెన్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటి వెరైటీలన్నింటినీ పెట్టడం వల్ల లాభాలు బాగా అందుకునే అవకాశం ఉంది. అలాగే పల్లెటూళ్లలో అయితే స్నాక్స్ , టిఫిన్స్ లో రకరకాల రుచికరమైన కొత్త వంటకాలు పెట్టడం వల్ల కూడా బిజినెస్ సాఫీగా జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏం బిజినెస్ చేయాలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఈ వ్యాపారాలు పెట్టుకోవచ్చు. అంటే మీరే ఉన్న చోట నుండి ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకోవచ్చు.

వ్యాపారాలు చేసుకోవడంలో రెండో పద్దతి ఏంటంటే.. ప్రాంచైజీలు తీసుకోవడం. పేరు మోసిన బ్రాండ్స్ అంటే బర్గర్ కింగ్, పిజ్జాహట్, డామినోస్, కెఎఫ్‌సి ఇలాంటి టాప్ ఫుడ్ వ్యాపారాలు ప్రాంచైజీలను ఇస్తుంటాయి. వీటిని తీసుకుని కూడా డవలప్ చేసుకోవచ్చు. లాభాలు పొందవచ్చు.

నాణ్యత ఎంత అవసరం?

పుడ్ బిజినెస్ అంటేనే నాణ్యత. అది లేకపోతే ఇందులో ఎవరూ వ్యాపారాలు చేయలేరు. ఎట్టిపరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో వ్యాపారం చేసేవాళ్లు రాజీ పడకూడదు. ఇలా ఉంటేనే మార్కెట్లో ఒక బ్రాండ్‌ని క్రియేట్ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories