Indian Railways:దేశంలో అతి పొడవైన రైలు అప్‌డేట్‌.. ప్రయాణికులకి మరింత దగ్గర..!

Vivek Express The Longest Train In The Country Has Changed Its Timing Now It Runs 4 Days A Week
x

Indian Railways:దేశంలో అతి పొడవైన రైలు అప్‌డేట్‌.. ప్రయాణికులకి మరింత దగ్గర..!

Highlights

Indian Railways:దేశంలో అతి పొడవైన రైలు అప్‌డేట్‌.. ప్రయాణికులకి మరింత దగ్గర..!

Indian Railways:రైల్వే ప్రయాణం పొదుపు, పూర్తి భద్రతతో కూడుకుంది. వ్యక్తిగత వాహనాల ద్వారా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడానికి చాలా ఖర్చవుతుంది. కానీ రైల్వే ద్వారా అతి తక్కువ ధరలో గమ్యస్థానాలకి చేరుకోవచ్చు. భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైలు నెట్‌వర్క్. ఇప్పుడు కొత్తగా వందే భారత్ వంటి అనేక రైళ్లను ప్రారంభించింది. ఇందులో ప్రయాణించడం వల్ల సమయం ఆదా అవుతుంది. సాధారణ రైళ్ల కంటే వేగంగా నడిచే ఈ రైళ్లలో మీకు మరిన్ని సౌకర్యాలు లభిస్తాయి.

దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లే భారతదేశపు పొడవైన రైలు వివేక్ ఎక్స్‌ప్రెస్. ఇటీవల దీని సమయవేళలో మార్పులు చేశారు. ఇది ప్రయాణీకులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వివేక్ ఎక్స్‌ప్రెస్ శని, ఆదివారాల్లో డిబ్రూఘర్ నుంచి కన్యాకుమారి వరకు రెండు రోజులు నడిచేది. కానీ ఇప్పుడు దాని సమయ వేళలని మార్చడం వల్ల వారానికి 4 రోజులు నడపడానికి సిద్దమయ్యారు. మే 27, 2023 నుంచి వివేక్ ఎక్స్‌ప్రెస్ ప్రతి శని, ఆది, మంగళ, గురువారాల్లో దిబ్రూఘర్ నుంచి కన్యాకుమారి వరకు నడుస్తుంది. మే 11, 2023 నుంచి ఈ రైలు ప్రతి బుధ, గురు, శని, సోమవారాల్లో కన్యాకుమారి నుంచి దిబ్రూఘర్ వరకు నడుస్తుంది.

ఈ రైలులో ఒక AC టూ టైర్, 4 AC త్రీ టైర్, 11 స్లీపర్ క్లాస్, 1 ప్యాంట్రీ కార్ మొత్తం 22 కోచ్‌లు ఉంటాయి. ఇది కాకుండా 2 పవర్ కమ్ లగేజీ, 3 జనరల్ సీటింగ్ ఉంటాయి. భారతదేశపు పొడవైన రైలు హోదాను పొందిన వివేక్ ఎక్స్‌ప్రెస్ దేశంలోని 9 రాష్ట్రాల గుండా వెళుతుంది. ఇది సుమారు 4189 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణించే ఈ రైలు 59 స్టాప్‌లను కలిగి ఉంటుంది. వివేక్ ఎక్స్‌ప్రెస్ 19 నవంబర్ 2011న ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories