VI: ఎక్కువ మంది రీఛార్జ్‌ చేసుకుంటున్న ఈ వీఐ ప్లాన్‌ ఎందుకంత ప్రత్యేకం తెలుసా?

VI 1749 Recharge Plan
x

VI: ఎక్కువ మంది రీఛార్జ్‌ చేసుకుంటున్న ఈ వీఐ ప్లాన్‌ ఎందుకంత ప్రత్యేకం తెలుసా?

Highlights

VI Recharge Plan: గత ఏడాది జూలై తర్వాత టెలికాం కంపెనీలు అన్నీ రీఛార్జీ ధరలను పెంచేశాయి. కానీ, వీఐ సంబంధించిన ఈ ప్యాక్‌ ఇంకా ట్రెండింగ్‌లో నిలిచింది ఎందుకో తెలుసా?

VI Recharge Plan: వీఐ రూ.1749 అందిస్తున్న ఈ ప్లాన్‌ ఎక్కువమంది రీఛార్జీ చేసుకుంటున్నారు. ఇదే ప్యాక్‌ ఇతర టెలికాం కంపెనీలు మాత్రం ఎక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. అయితే, వీఐ అందిస్తోన్న ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 180 రోజులు వర్తిస్తుంది. అయితే, జియో ఎయిర్‌టెల్‌ ఈ ధరలో 84 రోజులు వ్యాలిడిటీ అందిస్తున్నాయి.

రూ.1749 ప్లాన్‌..

వీఐ అందిస్తోన్న ఈ వీఐ ప్లాన్‌ ధర రూ.1749 మాత్రమే. ఇందులో 1.5 జీబీ డేటా ప్రతిరోజూ పొందుతారు. దీంతోపాటు అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ ఏ నెట్‌వర్క్‌ అయినా చేసుకోవచ్చు అంతేకాదు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందుతారు. ఇది మాత్రమే కాదు వీఐ వీటితోపాటు అదనంగా బింజే ఆల్‌ నైట్‌ బెనిఫిట్స్‌ కూడా అందిస్తోంది. అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వర్తిస్తుంది. అంతేకాదు 2 జీబీ బ్యాకప్‌ డేటా కూడా పొందుతారు.

ఎయిర్‌టెల్‌ రూ.1798 ప్లాన్‌..

ఎయిర్‌టెల్‌ అందిస్తోన్న ఈ ప్లాన్‌ 84 రోజులపాటు వ్యాలిడిటీ వస్తుంది. ఇందులో కూడా ప్రతిరోజూ 3 జీబీ డేటా 5 జీ నెట్‌వర్క్‌ స్పీడ్‌లో పొందుతారు. ఇందులో కూడా అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, ఉచితంగా 100 ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. ఇది మాత్రమే కాదు వింక్‌ మ్యూజిక్‌ ఉచిత యాక్సెస్‌ కూడా పొందుతారు.

జియో రూ.1799 ప్లాన్‌..

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ కూడా 84 రోజులు వర్తిస్తుంది. 3 జీబీ డేటాతోపాటు 5 జీ స్పీడ్‌ నెట్‌ పొందుతారు. ఈ జియో రీఛార్జీ ప్లాన్‌లో కూడా అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందుతారు.ఈ ప్యాక్‌లో అదనంగా జియో సినిమా, జియో టీవీ, నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ రీఛార్జీ ప్యాక్‌ యాక్సెస్‌ కూడా పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories