UPI Update: యూపీఐలో పెద్ద మార్పు ఫోన్ పే, గూగుల్ పేలో ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్‌కు గుడ్‌బై

UPI Update: యూపీఐలో పెద్ద మార్పు ఫోన్ పే, గూగుల్ పేలో ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్‌కు గుడ్‌బై
x

UPI Update: యూపీఐలో పెద్ద మార్పు ఫోన్ పే, గూగుల్ పేలో ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్‌కు గుడ్‌బై

Highlights

యూపీఐ యాప్‌లు ఉపయోగించే వారికి కీలక సమాచారం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజా నిర్ణయం ప్రకారం, అక్టోబర్ 1 నుంచి యూపీఐలోని పర్సన్-టు-పర్సన్ (P2P) ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్‌ను పూర్తిగా నిలిపివేయనున్నారు.

యూపీఐ యాప్‌లు ఉపయోగించే వారికి కీలక సమాచారం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజా నిర్ణయం ప్రకారం, అక్టోబర్ 1 నుంచి యూపీఐలోని పర్సన్-టు-పర్సన్ (P2P) ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్‌ను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఈ ఫీచర్‌ ద్వారా స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల వద్ద నుండి డబ్బు అడగడం, బిల్లులు షేర్ చేసుకోవడం సులభం అవుతుండేది.

అయితే, ఇటీవల సైబర్ మోసగాళ్లు ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నకిలీ పేమెంట్ రిక్వెస్ట్‌లు పంపి, వినియోగదారులకు తెలియకుండానే లావాదేవీలు జరుపుతున్నారు. NPCI ఇప్పటికే ఈ ఫీచర్‌ ట్రాన్సాక్షన్ పరిమితిని రూ. 2 వేలకే తగ్గించినప్పటికీ, మోసాలు తగ్గకపోవడంతో, వినియోగదారుల భద్రత కోసం ఈ ఫీచర్‌ను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది.

అయితే, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, స్విగ్గీ, ఐఆర్‌సిటిసి వంటి సంస్థలు ఉపయోగించే మెర్చంట్ కలెక్ట్ రిక్వెస్ట్‌లు మాత్రం కొనసాగుతాయి. వీటిలో వినియోగదారుల ఆమోదం, యూపీఐ పిన్ తప్పనిసరి.

ఇకపై డబ్బు పంపాలంటే QR కోడ్ స్కాన్ చేయాలి లేదా రిసీవర్‌ యూపీఐ ఐడీ/ఫోన్ నంబర్ నమోదు చేసి పిన్ ద్వారా లావాదేవీ చేయాలి. అక్టోబర్ 1 నుంచి ‘ప్లీజ్ పే మీ’ రిక్వెస్ట్‌ స్నేహితులు, కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండదు. ముఖ్యంగా, మీ ఫోన్‌ను ఇతరులకు ఇవ్వేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories