
UPI : గ్రామాల్లో ఎంత శాతం మంది UPI వాడుతున్నారో తెలుసా..?
UPI : భారతదేశం డిజిటల్ ఇండియాగా ఎలా మారుతుందో చెప్పడానికి తాజా గణాంకాలే నిదర్శనం. నిన్న మొన్నటి వరకు చిల్లర కోసం వెతుక్కునే పరిస్థితి నుంచి, నేడు మారుమూల పల్లెల్లో కూడా 'క్యూఆర్ కోడ్' స్కాన్ చేసే స్థాయికి మనం చేరుకున్నాం.
UPI: భారతదేశం డిజిటల్ ఇండియాగా ఎలా మారుతుందో చెప్పడానికి తాజా గణాంకాలే నిదర్శనం. నిన్న మొన్నటి వరకు చిల్లర కోసం వెతుక్కునే పరిస్థితి నుంచి, నేడు మారుమూల పల్లెల్లో కూడా 'క్యూఆర్ కోడ్' స్కాన్ చేసే స్థాయికి మనం చేరుకున్నాం. తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన చింతన్ శిబిరం (ఫిబ్రవరి 13-14, 2026) లో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో నగదు లావాదేవీలను వెనక్కి నెట్టి UPI అగ్రస్థానంలో నిలిచింది.
ఈ నివేదికలోని అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. పట్టణాల కంటే వేగంగా గ్రామీణ భారతం డిజిటల్ బాట పట్టింది.గ్రామీణ ప్రాంతాల్లో 57 శాతం మంది ఇప్పుడు నగదు కంటే UPI లావాదేవీలకే మొగ్గు చూపుతున్నారు.65 శాతం మంది వినియోగదారులు రోజుకు ఒకటి కంటే ఎక్కువ డిజిటల్ లావాదేవీలు చేస్తూ, దీనిని ఒక జీవనశైలిగా మార్చుకున్నారు.వాడుకలో సౌలభ్యం, సెకన్ల వ్యవధిలో నిధుల బదిలీ కావడం వల్ల సామాన్య కూలీల నుంచి పెద్ద వ్యాపారుల వరకు అందరూ UPIనే నమ్ముకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూపే డెబిట్ కార్డులు, భీమ్ UPI ప్రోత్సాహక పథకాలు క్షేత్రస్థాయిలో అద్భుతమైన మార్పును తెచ్చాయి. సుమారు 15 రాష్ట్రాల్లో 10,000 మందికి పైగా వినియోగదారులు, వ్యాపారుల అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను రూపొందించారు. తక్కువ విలువ గల లావాదేవీలకు UPI Lite వంటి ఆవిష్కరణలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయి.
డిజిటల్ అక్షరాస్యతను మరింత పెంచడం, సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించడం, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని చోట కూడా లావాదేవీలు జరిగేలా సాంకేతికతను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. జేబులో నోట్ల కట్టలు లేకపోయినా, స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు కొండనైనా కొనేయొచ్చనే నమ్మకాన్ని UPI కలిగించింది. ఈ డిజిటల్ ప్రయాణం కేవలం లావాదేవీలకే పరిమితం కాకుండా, దేశ ఆర్థిక పారదర్శకతకు కొత్త బాటలు వేస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




