UPI: ఫోన్‌పే, గూగుల్‌పే వాడేవారికి కీలక హెచ్చరిక.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి!

UPI: ఫోన్‌పే, గూగుల్‌పే వాడేవారికి కీలక హెచ్చరిక.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి!
x

UPI: ఫోన్‌పే, గూగుల్‌పే వాడేవారికి కీలక హెచ్చరిక.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి!

Highlights

దేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) వినియోగం విస్తృతంగా పెరుగుతోంది. అయితే, ఆగస్టు 1 నుండి ఈ సేవలకు సంబంధించి కొన్ని కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి.

దేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) వినియోగం విస్తృతంగా పెరుగుతోంది. అయితే, ఆగస్టు 1 నుండి ఈ సేవలకు సంబంధించి కొన్ని కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా, రోజుకు 50 సార్లు కన్నా ఎక్కువ UPI బ్యాలెన్స్ తనిఖీ చేయడం ఇకపై వీలుకాదు. ఈ మార్పులు సాధారణ వినియోగదారులతో పాటు వ్యాపారులు, బ్యాంకులు అందరికీ వర్తిస్తాయి.

అలానే, ఆటో-పే లావాదేవీలు — బిల్లులు, EMIలు, సబ్‌స్క్రిప్షన్‌ పేమెంట్లు — కేవలం నిర్ణీత సమయాల్లోనే జరుగుతాయి. ఉదయం 10 గంటల ముందు, మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 వరకు, రాత్రి 9:30 తర్వాత మాత్రమే ఈ పేమెంట్లు ప్రక్రియలోకి వస్తాయి. సిస్టమ్‌పై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిబంధనలు తీసుకొచ్చారు.

ఒక లావాదేవీ విఫలమైతే, దాని స్థితిని కనీసం మూడు రోజుల తర్వాతే తనిఖీ చేయవలసి ఉంటుంది. అలాగే, ప్రతి ట్రాన్సాక్షన్‌ మధ్య కనీసం 90 సెకన్ల గ్యాప్ ఉండాలి.

గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వాడేవారికి కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎదురైన సాంకేతిక లోపాల వల్ల వచ్చిన ఇబ్బందులపై స్పందనగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక సాధారణ వినియోగదారులపై ఈ మార్పుల ప్రభావం తక్కువగా ఉంటుంది. వారు పాత విధానాల ప్రకారం బిల్లులు, ఇతర లావాదేవీలు చేయవచ్చు. ఒక రోజుకు రూ.1 లక్ష వరకు చెల్లింపులు అనుమతిస్తారు. విద్య, ఆరోగ్య సేవల కోసం అయితే రూ.5 లక్షల వరకు లావాదేవీలు చేయొచ్చు. కానీ రోజుకు 50 సార్లకు మించి బ్యాలెన్స్ చెక్ చేయడం మాత్రం ఇకపై సాధ్యం కాదు.

Show Full Article
Print Article
Next Story
More Stories