Jio Cheapest Plans: జియో వినియోగదారులకి 2 చౌకైన ప్లాన్‌లు.. ఇంకా చాలా ప్రయోజనాలు..!

Two Cheapest Plans for Jio Users Know the Benefits
x

Jio Cheapest Plans: జియో వినియోగదారులకి 2 చౌకైన ప్లాన్‌లు.. ఇంకా చాలా ప్రయోజనాలు..!

Highlights

Jio Cheapest Plans: టెలికాం కంపెనీలలో రిలయన్స్‌ జియో ఒక సంచలనం. ఇది మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరి చేతిలో ఇంటర్నెట్‌ ఉంటుంది.

Jio Cheapest Plans: టెలికాం కంపెనీలలో రిలయన్స్‌ జియో ఒక సంచలనం. ఇది మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరి చేతిలో ఇంటర్నెట్‌ ఉంటుంది. మరే కంపెనీ కూడా దీని పోటీకి తట్టుకోవడం లేదు. జియో ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త ప్లాన్లని తీసుకొస్తుంది. ఇవి అపరిమిత ప్రయోజనాలతో పాటు కొనుగోలు చేయడానికి చౌకగా ఉంటాయి. ఈరోజు రెండు హై-స్పీడ్ ఇంటర్నెట్ ప్యాక్‌ల గురించి తెలుసుకుందాం. డేటా ముగిసిన తర్వాత అధిక వేగంతో ఇంటర్నెట్ కావాలనుకునే వారికి ఈ ప్లాన్లు సెట్‌ అవుతాయి.

జియో రూ19 డేటా బూస్టర్ ప్లాన్

ఈ డేటా బూస్టర్ ప్లాన్ యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్‌కు టాప్-అప్‌గా 1.5GB డేటా ప్లాన్‌ను అందిస్తుంది. ధర కేవలం 19 రూపాయలు మాత్రమే. అయితే ఈ ప్లాన్‌ పొందేందుకు వినియోగదారుల రెగ్యులర్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ యాక్టివేట్‌గా ఉండాలి.

జియో రూ. 29 డేటా బూస్టర్ ప్లాన్

ఈ ప్లాన్‌లో వినియోగదారులు 2.5GB డేటా ఆఫర్‌తో పాటు ఇంటర్నెట్ టాప్-అప్ పొందుతారు. సాధారణ రీఛార్జ్ ప్లాన్‌లో రోజువారీ డేటా పరిమితిని ముగిసినప్పుడు ఈ డేటా ప్యాక్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. వినియోగదారులు జియో 5G నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయితే రెండు డేటా బూస్టర్‌లు 5G డేటా వేగాన్ని అందిస్తాయి. మై జియో యాప్‌ని సందర్శించి లేదా ఇతర సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఈ డేటా బూస్టర్ ప్లాన్‌లని రీఛార్జ్ చేసుకోవచ్చు.

వోడాఫోన్-ఐడియా కొత్త డేటా ప్యాక్‌

అలాగే వోడాఫోన్-ఐడియా ఒక కొత్త డేటా ప్యాక్‌ను ప్రకటించింది. వారి వినియోగదారుల కోసం "సూపర్ డే", "సూపర్ అవర్" డేటా ప్యాక్‌లను ప్రారంభించింది. ఈ ప్యాక్ ఇంటర్నెట్ రీఫిల్ అవసరమయ్యే వినియోగదారుల కోసం పనిచేస్తాయి. "సూపర్ అవర్" ప్యాక్ ధర రూ. 24 ఇది ఒక గంట పాటు అపరిమిత డేటా ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే "సూపర్ డే" ప్యాక్ ధర రూ. 49 ఇది 24 గంటల పాటు 6GB డేటాను అందిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories