logo
Business

Petrol Price: దేశంలో ఆల్ టైమ్ హైకి చేరిన పెట్రో ధరలు.

Petrol price today 07-01-2021
X

Representational image

Highlights

* దాదాపు నెల రోజుల తర్వాత పెట్రోల్ ధరల భగభగలు.. * రోజువారీ ధరల సమీక్షలో భాగంగా రేట్ల సవరణ.. * డిల్లీలో పెట్రోల్ లీటరుకు 23 పైసలు పెంపు..

దేశంలో పెట్రో ధరలు ఆల్ టైమ్ హై వద్దకు చేరాయి.దేశంలోని మెట్రో నగరాల్లో దాదాపు నెల రోజుల తర్వాత పెట్రోల్ , డీజిల్ ధరల పరుగులు కొనసాగుతున్నాయి.రోజువారీ ధరల సమీక్షలో భాగంగా వరుసగా రెండో రోజు చమురు సరఫరా సంస్థలు రేట్లను సవరించాయి.ఫలితంగా రాజధాని డిల్లీలో పెట్రోల్ లీటరుకు 23 పైసలు పెరిగి 84 రూపాయల 20 పైసలకు చేరుకోగా, డీజిల్ 26 పైసలు పెరిగి 74రూపాయల 38 పైసలు వద్దకు చేరుకుంది.తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 87రూపాయల 59 పైసలు డీజిల్ ధర లీటర్‌ 81 రూపాయల 17 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Web TitlePetrol Price today 07-12-2021 increased in India
Next Story