Petrol Pumps Free Services: పెట్రోల్‌ పంపుల నుంచి ఈ సేవలు ఉచితంగా పొందవచ్చు.. ఎలాంటి పే చేయనవసరం లేదు..!

These Services Can Be Availed From Petrol Pumps For Free No Need To Pay
x

Petrol Pumps Free Services: పెట్రోల్‌ పంపుల నుంచి ఈ సేవలు ఉచితంగా పొందవచ్చు.. ఎలాంటి పే చేయనవసరం లేదు..!

Highlights

Petrol Pumps Free Services: మనం నిత్యం వెహికల్స్‌లో పెట్రోల్‌ కొట్టించడానికి బంక్‌లకు వెళుతూ ఉంటాం.

Petrol Pumps Free Services: మనం నిత్యం వెహికల్స్‌లో పెట్రోల్‌ కొట్టించడానికి బంక్‌లకు వెళుతూ ఉంటాం.కాని అక్కడ కొన్ని విషయాలను ఎప్పుడూ గమనించం. వాస్తవానికి పెట్రోల్‌ బంకులు పబ్లిక్‌ సర్వీస్‌ పాయింట్లు. ఈ విషయం చాలామందికి తెలియదు. పెట్రోల్‌ బంక్‌ లైసెన్స్‌ ఇవ్వాలంటే ప్రజలకు అవసరమయ్యే కొన్ని ఉచిత సేవలను కల్పించాల్సి ఉంటుంది. ఇవి తప్పకుండా ఉంటేనే ప్రభుత్వాలు లైసెన్స్‌ జారీ చేస్తాయి. వీటిని ప్రజలు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి పేమెంట్‌ చేయనవసరం లేదు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఉచిత టాయిలెట్

నిజానికి పెట్రోల్ పంప్ అంటే రోజూ వేలాది మంది వస్తుంటారు. అందుకే ప్రజలు తరచుగా ఉపయోగించే కొన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించాలి. అందులో ఒకటి టాయిలెట్. పెట్రోల్ పంపు వద్ద లేడీస్ అండ్ జెంట్స్ టాయిలెట్ కచ్చితంగా ఉండాలి. మీరు సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నప్పుడు టాయిలెట్కు వెళ్లవలసి వస్తే పెట్రోల్ పంప్ ఉన్న ప్రదేశానికి వెళ్లి పని ముగించుకోవచ్చు. ఈ విషయంలో పెట్రోల్ పంపు సిబ్బంది అబ్జెక్షన్ చేస్తే దీని గురించి సదరు పెట్రోల్‌ కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చు. అవసరమైతే లైసెన్స్‌ క్యాన్సెల్‌ చేయించవచ్చు.

తాగునీరు

మరుగుదొడ్డితో పాటు పెట్రోల్ పంపు వద్ద తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. ప్రతి పెట్రోల్ పంప్‌లో వాటర్ ఆర్‌ఓ ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు మీ వాటర్ బాటిల్‌ను రీఫిల్ చేసుకోవచ్చు. నీరు కూడా తాగవచ్చు. నీటి సౌకర్యం లేకుంటే పెట్రోల్ పంప్ మేనేజర్ ను అడగవచ్చు. కంప్లెయింట్‌ చేయవచ్చు.

ఉచిత గాలి

పెట్రోల్ పంపుల వద్ద ఉచిత గాలిని నింపే సదుపాయం ఏర్పాటుచేయాలి. ప్రతి పెట్రోల్ పంపులో ఎయిర్ పంప్ ఉంటుంది. ఇక్కడ టైర్లలో గాలి నింపే పని జరుగుతుంది. దీని కోసం ఎవరూ మీ నుంచి డబ్బులు వసూలు చేయకూడదు. ఇది కాకుండా పెట్రోల్ పంపు వద్ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories