Post Office: ఈ పోస్టాఫీసు స్కీంలు మంచి రిటర్న్స్‌ ఇస్తాయి.. కానీ పన్ను ప్రయోజనం లభించదు..!

These Post Office Schemes Give Good Returns But No Tax Benefit Under Section 80C
x

Post Office: ఈ పోస్టాఫీసు స్కీంలు మంచి రిటర్న్స్‌ ఇస్తాయి.. కానీ పన్ను ప్రయోజనం లభించదు..!

Highlights

Post Office: పోస్టాఫీస్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ఆదాయం సంపాదించవచ్చు. మధ్యతరగతి వారికి, మహిళలకు ఈ స్కీమ్‌లు బాగా సెట్‌ అవుతాయి.

Post Office: పోస్టాఫీస్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ఆదాయం సంపాదించవచ్చు. మధ్యతరగతి వారికి, మహిళలకు ఈ స్కీమ్‌లు బాగా సెట్‌ అవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ల వడ్డీలపై తరచూ మార్పులు చేస్తూ ఉంటుంది. బ్యాంకు వడ్డీల కంటే ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని స్కీమ్‌లు సెక్షన్‌ 80 సి కింద పన్ను ప్రయోజనాన్ని అందిస్తాయి. మరికొన్ని అందించవు. అలాంటి కొన్ని స్కీమ్‌ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. మహిళా సమ్మాన్ సేవింగ్‌ స్కీమ్‌

భారత ప్రభుత్వం మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ 2023 (మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్) అనేది మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించారు. భారతీయ మహిళల్లో పొదుపు అలవాటును పెంపొందించడమే దీని ఉద్దేశ్యం. పథకం ప్రయోజనాన్ని పొందేందుకు వయోపరిమితి లేదు ఈ పథకంలో వచ్చే వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి వ్యక్తి పన్ను స్లాబ్ (పన్ను వర్గం), వడ్డీ ఆదాయం బట్టి TDS కట్‌ అవుతుంది.

నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్

పోస్ట్ ఆఫీస్‌లో ఒకటి, రెండు, మూడు లేదా ఐదు సంవత్సరాల పాటు టైమ్ డిపాజిట్ ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు. కావాలంటే ఈ వ్యవధిని మరింత పెంచుకోవచ్చు. ఈ ఖాతాపై ఒక సంవత్సరానికి 6.9%, రెండేళ్లకు 7.0%, మూడేళ్లకు 7.1% వడ్డీ లభిస్తుంది. పోస్టాఫీసులో ఐదేళ్ల టైమ్ డిపాజిట్లపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ ఐదేళ్ల కంటే తక్కువ డిపాజిట్‌ చేస్తే వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్

ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల 5 ఏళ్లపాటు వార్షిక ప్రాతిపదికన 6.7% వడ్డీని పొందుతారు. ఇందులో ప్రతి సంవత్సరం చక్రవడ్డీ ప్రయోజనం లభిస్తుంది. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఒంటరిగా లేదా కలిసి అకౌంట్‌ను ఓపెన్‌ చేయవచ్చు. ప్రతి నెలా కనీసం రూ. 100 లేదా దాని మల్టిపుల్‌ ద్వారా డిపాజిట్ చేయవచ్చు. ఇందులో డిపాజిట్‌పై ఎలాంటి పరిమితి ఉండదు.

కిసాన్ వికాస్ పత్ర

కిసాన్‌ వికాస్‌ పత్రపై కూడా ఆదాయపు పన్ను మినహాయింపు లభించదు. ఇందులో డిపాజిట్ చేసిన మొత్తంపై వార్షిక వడ్డీ 'ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం'గా పరిగణిస్తారు. దీంతో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను మినహాయింపు లేనప్పటికీ కిసాన్ వికాస్ పత్ర సురక్షితమైన పెట్టుబడి ఎంపిక అని చెప్పవచ్చు.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ లో రూ.1,500 నుంచి గరిష్ఠంగా రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్‌లో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతి సంవత్సరం 7.4% వడ్డీని పొందుతారు కానీ దానిపై పన్ను విధిస్తారు. ఈ పెట్టుబడి ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద రాదు. 40,000 కంటే ఎక్కువ వడ్డీపై TDS తీసివేయబడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories