Post Office: పోస్టాఫీసుకి చెందిన ఈ 4 పథకాలు అద్భుతం.. సులభంగా కోటీశ్వరులు..!

These Four Post Office Schemes are Amazing Easy Millionaires
x

Post Office: పోస్టాఫీసుకి చెందిన ఈ 4 పథకాలు అద్భుతం.. సులభంగా కోటీశ్వరులు..!

Highlights

Post Office: మీరు పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకుంటే పోస్ట్ ఆఫీస్‌కి చెందిన నాలుగు అద్భుతమైన పథకాలు ఉన్నాయి.

Post Office: మీరు పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకుంటే పోస్ట్ ఆఫీస్‌కి చెందిన నాలుగు అద్భుతమైన పథకాలు ఉన్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలను పొందవచ్చు. ఈ జాబితాలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), రికరింగ్ డిపాజిట్ (RD), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), టైమ్ డిపాజిట్ (TD) పథకాలు ఉన్నాయి. వీటిలో పెట్టుబడిదారులు కొన్ని సంవత్సరాలలో భారీ ఫండ్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. దీనిలో నెలకు గరిష్టంగా రూ. 12,500 డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ 15 సంవత్సరాలు. దీన్ని 5-5 సంవత్సరాల చొప్పున పొడిగించవచ్చు. ఈ పథకంలో ఏటా 7.1 శాతం వడ్డీని అందిస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం రూ. 1.5 లక్షలు పెట్టుబడి 25 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే మీ మొత్తం రూ. 37,50,000 అవుతుంది. 25 సంవత్సరాల తర్వాత చక్రవడ్డీ ప్రయోజనాన్ని కలుపుకొని రూ. 1.03 కోట్లు అవుతుంది.

రికరింగ్ డిపాజిట్

రికరింగ్ డిపాజిట్‌లో నెలవారీ గరిష్ట మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. ఇందులో ఎలాంటి పరిమితిని నిర్ణయించలేదు. PPFకి సమానంగా ప్రతి నెలా 12500 పెట్టుబడి పెడితే పెద్ద ఫండ్ సిద్దమవుతుంది. RDలో ఎన్ని సంవత్సరాలైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ఏటా 5.8 శాతం చక్రవడ్డీ లభిస్తుంది. గరిష్ట వార్షిక డిపాజిట్‌ని పెట్టుబడి పెట్టినట్లయితే రూ. 1,50,000, ఆపై 27 సంవత్సరాల తర్వాత చక్రవడ్డీ ప్రకారం మొత్తం దాదాపు రూ. 99 లక్షలు అవుతుంది. ఇందులో మీ పెట్టుబడి రూ.40,50,000 లక్షలు అవుతుంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్నుమినహాయింపు పొందవచ్చు. ఇందులో మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లు. ఇందులో ఏటా 6.8 శాతం వడ్డీ అందుతోంది. ఇతర చిన్న పొదుపు పథకాలలో వడ్డీ రేటు ప్రతి త్రైమాసికంలో మారుతుంది. కానీ NSCలో పెట్టుబడి పెట్టే సమయంలో వడ్డీ రేటు ఎంత ఉంటుందో మెచ్యూరిటీ వరకు అదే ఉంటుంది.

టైమ్ డిపాజిట్

టైమ్ డిపాజిట్‌లో గరిష్ట పరిమితి నిర్ణయించలేదు. 5 సంవత్సరాల డిపాజిట్‌పై సంవత్సరానికి 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టడం వల్ల 6.7 శాతం వార్షిక వడ్డీ రేటును పొందుతారు. 30 సంవత్సరాలలో సులువుగా కోటీశ్వరులు అవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories