8th Pay Commission: జీతం పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందా? ఆర్థికవేత్తలు ఏమన్నారంటే..?

The Truth Behind the 8th Pay Commission Salary Hike and Inflation Increase
x

8th Pay Commission: జీతం పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందా? ఆర్థికవేత్తలు ఏమన్నారంటే..?

Highlights

8th Pay Commission: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెద్ద బహుమతి ఇచ్చింది.

8th Pay Commission: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెద్ద బహుమతి ఇచ్చింది. ప్రధాని మోదీ ఇంట్లో జరిగిన కేబినెట్ మీటింగులో ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఆమోదం లభించింది. ఇది జనవరి 1, 2026 నుండి అమల్లోకి వస్తుంది. 8వ వేతన సంఘానికి సంబంధించి ఉద్యోగులు, సంఘాలు 2.86 వరకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ సిఫార్సులను ఆమోదిస్తే ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం జీతం పెంచితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి.

2025-26 తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఏకీకరణ మార్గంలోనే ఉండాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు అన్నారు. 2025-26 నాటికి ప్రభుత్వం తన ద్రవ్య లోటును GDPలో 4.5శాతం కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనా 4.9%. 8వ వేతన సంఘం అమలు తర్వాత దేశ ఆర్థిక గణాంకాలలో తగ్గుదల ఉంటుందని ఐసిఆర్‌ఎ చీఫ్ అదితి నయ్యర్ అన్నారు. దీనితో పాటు వేతన సంఘం అమలు చేయబడినప్పుడల్లా అది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల, దేశ ద్రవ్యలోటును GDPలో 3 శాతానికి తగ్గించడం అవసరం. ద్రవ్యలోటు తగ్గితే ప్రభుత్వం అధిక వ్యయాన్ని చేయగలుగుతుంది.

8వ వేతన సంఘంలో ప్రభుత్వం ఎంత జీతం పెంచుతుందో నిపుణులు ఇప్పటికే వెల్లడించారు. ఇది పెన్షన్ సవరణల మొత్తంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇది ద్రవ్యోల్బణం, ప్రభుత్వ జీత ఖర్చులపై ప్రభావం చూపుతుంది. అలాగే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల పెరుగుదల ప్రైవేట్ వినియోగానికి పాక్షికంగా మద్దతు ఇవ్వగలదు. అదే సమయంలో పొదుపును కూడా పెంచుతుంది. ఎందుకంటే ప్రైవేట్ వినియోగంలో బలహీనత కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి క్షీణించింది. దీనితో పాటు కేంద్ర వేతన సవరణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలను ప్రభావితం చేస్తుందని, ఇది పెన్షన్ బిల్లును కూడా పెంచుతుందని నిపుణులు తెలిపారు. మొత్తం మీద, 8వ వేతన సంఘాన్ని అమలు చేయడంతో పాటు ప్రభుత్వం దేశంలో ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక లోటు పెరగకుండా చూసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories