Money: మీ బ్యాంకు అకౌంట్లో ఒక్క రూపాయి లేకపోయినా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం..ఎలాగంటే..?

The ability to transfer money even if you dont have a single rupee in your bank account
x

Money: మీ బ్యాంకు అకౌంట్లో ఒక్క రూపాయి లేకపోయినా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం..ఎలాగంటే..?

Highlights

Money: సాధారణంగా అకౌంట్లో డబ్బులు లేనప్పుడు క్రెడిట్ కార్డు ఉపయోగించి బిల్లులు చెల్లించడం అంటూ చేస్తూ ఉంటాం. లేదంటే బ్యాంకుకు వెళ్లి మీరు ఉద్యోగులు...

Money: సాధారణంగా అకౌంట్లో డబ్బులు లేనప్పుడు క్రెడిట్ కార్డు ఉపయోగించి బిల్లులు చెల్లించడం అంటూ చేస్తూ ఉంటాం. లేదంటే బ్యాంకుకు వెళ్లి మీరు ఉద్యోగులు అయినట్లయితే ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడం ద్వారా మీరు మీ అవసరాలను తీర్చుకునే అవకాశం లభిస్తుంది. కానీ ప్రస్తుతం మన అకౌంట్ లో డబ్బులు లేకపోయినప్పటికి డబ్బులు ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తూ ఆర్బిఐ ప్రత్యేకమైన పర్మిషన్ అందించింది. ఈ సదుపాయం బ్యాంకులు తమ కస్టమర్లకు అందించుకోవచ్చు. దీనికోసం వారు ప్రత్యేకంగా చార్జి చేసుకోవచ్చు. ఈ సదుపాయం వల్ల మీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా తాత్కాలికంగా డబ్బులు క్రెడిట్ రూపంలో తీసుకొని తిరిగి బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే.

బ్యాంక్ అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా లేకపోయినా ఇప్పుడు యూపిఐ యాప్స్ ద్వారా మీరు డబ్బులు పంపవచ్చు. ఆర్బిఐ కొత్తగా యూపిఐ నౌ పే లెటర్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే ఓవర్ డ్రాఫ్ట్ లాంటిది.మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బు కాకుండా ఎంతైతే డబ్బుని మనం వాడకున్నామో. ఆ మొత్తాన్ని 45 రోజుల్లోగా బ్యాంకు కి వెనక్కి కట్టాలి కొన్ని బ్యాంకులు ఎటువంటి వడ్డీని ఛార్జ్ చేయట్లేదు. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ని ఓపెన్ చేస్తే ఈ ఆప్షన్ ఉంటుంది. మీరు దీన్ని యాక్టివేట్ చేసు చేసుకోవడం ద్వారా డబ్బు వాడుకునే అవకాశం లభిస్తుంది.

మీ ప్రొఫైల్‌ను బట్టి రూ.50,000 వరకు లిమిట్ ని సాంక్షన్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ ఈ సదుపాయం యాక్టివేట్ చేయడానికి డబ్బులు ఛార్జ్ చేస్తున్నాయి, ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంక్ ఈ సదుపాయం కోసం రూ.500తో పాటు జిఎస్టి ని చార్జ్ చేస్తుంది. వన్ టైం డ్యూరేషన్ ఉంటుంది. ఇందులో45 రోజులకు గానూ వడ్డీ 3% వసూలు చేయనుంది. ఒక నెలకు రూ. 3000 కన్నా ఎక్కువ డబ్బుని యూజ్ చేసినట్లయితే వడ్డీ కాకుండా ఎక్స్ ట్రా చార్జ్ రూ.75 ప్లస్ జిఎస్టి వసూలు చేసే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories