TATA: మళ్లీ చిన్న సంస్థలను కొనే బిజీలో టాటా..ఇప్పటికే పలు కంపెనీలు టాటా సొంతం

Tata Purchasing Small Industries
x

TATA: మళ్లీ చిన్న సంస్థలను కొనే బిజీలో టాటా..ఇప్పటికే పలు కంపెనీలు టాటా సొంతం

Highlights

Tata Purchasing Small Industries: ప్రముఖ దిగ్గజ కంపెనీ టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ఇప్పుడు మళ్లీ మరికొన్ని ఇతర కంపెనీలను కొనే ప్లాన్ చేస్తుంది. ఒకవైపు సొంతంగా తన కంపెనీలను నిర్వహిస్తూనే మరోవైపు చిన్న చిన్న కంపెనీలను తన సొంతం చేసుకుంటుంది.

TATA: ప్రముఖ దిగ్గజ కంపెనీ టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ఇప్పుడు మళ్లీ మరికొన్ని ఇతర కంపెనీలను కొనే ప్లాన్ చేస్తుంది. ఒకవైపు సొంతంగా తన కంపెనీలను నిర్వహిస్తూనే మరోవైపు చిన్న చిన్న కంపెనీలను తన సొంతం చేసుకుంటుంది. గతేడాది క్యాపిటల్ ఫుడ్స్‌ తో పాటు , ఆర్గానిక్ ఇండియాను దాదాపు 7వేల కోట్ల రూపాయలతో కొనుగోలు చేసింది. ఇప్పుడు మళ్లీ కొన్ని కంపెనీలను కొనే ప్లాన్‌లో ఉన్నట్టు టాటా కన్జూమర్ డైరెక్టర్ పీబీ బాలాజీ తెలిపారు.

గతకొంతకాలంగా టాటా కంపెనీ ఫుడ్ విభాగాన్ని బాగా అభివృద్ది చేయాలని చూస్తుంది. ఇప్పటికే బెంగళూరు సంస్థ కొట్టారం ఆగ్రో ఫుడ్స్‌ ను సైతం చేజిక్కించుకుంది. ఇంకా తన కంపెనీ పోర్ట్ పోలియోకు తగిన ధరలో ఏ ఇతర కంపెనీలు దొరికినా వాటిని కూడా కొనుగోలు చేస్తామని ఆ సంస్థ కన్జూమర్ డైరెక్టర్ బాలాజీ అన్నారు. అలా అని తన సొంత కంపెనీల బాధ్యతలను వదులుకోమని, ఒక పక్క సొంత కంపెనీల బాధ్యత, మరో పక్క ఈ ఫుడ్ కంపెనీలను రెండు భుజాన్న వేసుకుని మరీ మోస్తామని ఆయన అన్నారు.

టీ ధరల విషయానికొస్తే అంతకుముందు అత్యంత గరిష్టాలకు వెళ్లిన ధరలు ఇటీవల కాస్త నిలకడగా ఉన్నాయి. దీంతో కంపెనీ మార్జిన్లు, లాభాలు అన్నీ మెరుగుపడనున్నట్టు బాలాజీ చెప్పారు. అదేవిధంగా ఈ ఏడాది తేయాకు దిగుబడి గతేడాది కంటే పెరగనున్నట్టు కూడా ఆయన ఆనందాన్ని వ్యక్తం చేసారు. కాఫీ ధరలు హెచ్చుతగ్గులు అయినా లాభాలు సాధారణ స్థితిలోనే ఉన్నాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories