Tata Pay: టాటా మరో సంచలనం.. గూగుల్‌ పే, ఫోన్‌ పేకి పోటీగా టాటా పే...!

Tata Another Sensation Tata Pay as a competition to Google Pay and Phone Pay
x

Tata Pay: టాటా మరో సంచలనం.. గూగుల్‌ పే, ఫోన్‌ పేకి పోటీగా టాటా పే...! 

Highlights

Tata Pay: టాటా మరో సంచలనం.. గూగుల్‌ పే, ఫోన్‌ పేకి పోటీగా టాటా పే...!

Tata Pay: కరోనా వల్ల దేశంలో యూపీఐ సేవలు ( 'యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు అన్ని చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ మాధ్యమం ద్వారా చెల్లింపులు చాలా సులభం. ఇది ఒక బ్యాంకు నుంచి మరోక బ్యాంకుకు గూగుల్‌ పే లేదా ఫోన్‌ పే, అమెజాన్‌ పే ఇలా చాలా యాప్‌లతో చెల్లింపులు చేయవచ్చు. ఇప్పడు వీటికి కొత్తగా మరో యాప్ వచ్చింది. టాటా కంపెనీ యూపీఐ సేవలు చేయడానికి సొంత యాప్‌ టాటా పే ప్రారంభించింది.

టాటా పే యూపీఐ సేవలు టాటా న్యూ యాప్‌లో అందుబాటులో ఉండనుంది. టాటా న్యూ యాప్‌తో జరిపే లావాదేవీలను టాటా పే ఉపయోగించి చేయవచ్చు. ఈ చెల్లింపులతో యూజర్లకు న్యూకాయిన్స్‌(Neucoins) లభిస్తాయి. టాటా పే ఉపయోగించి లేదా ఏదైనా టాటా గ్రూప్స్‌కు చెందిన స్టోర్లలో జరిపే కొనుగోళ్ల ద్వారా మాత్రమే న్యూకాయిన్స్‌ లభిస్తాయి. ప్రతి ఒక్క న్యూకాయిన్స్‌ విలువ రూ. 1 సమానం. కొత్త టాటా పే యూపీఐ ఖాతాను సృష్టించడానికి. ప్రతి ఒక్కరు మూడు-దశల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అనుసరించాలి.

స్కానింగ్, బ్యాలెన్స్ చెక్, ఖాతా/ స్వీయ-బదిలీ మొదలైన అన్ని సౌకర్యాలు టాటా యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే భారత్‌లో యూపీఐ సేవలు గణనీయంగా పుంజుకున్నాయి. దేశ వ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు ఫిబ్రవరి, 2022లో రూ. 8.26 లక్షల కోట్లతో పోలిస్తే మార్చి 2022లో రూ. 9.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరలో యూపీఐ లావాదేవీలు ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా రూ. 81 లక్షల కోట్ల మార్కును దాటాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories