ఎల్‌ఐసీ సూపర్ హిట్‌ ప్లాన్.. 4 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు.. బంపర్ ప్రయోజనాలు..!

Super LIC Policy Shiromani Plan Easily get One Crore Rupees | LIC New Policy
x

ఎల్‌ఐసీ సూపర్ హిట్‌ ప్లాన్.. 4 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు.. బంపర్ ప్రయోజనాలు..!

Highlights

LIC Policy: మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి మంచి లాభాలు సంపాదించాలంటే ఈ వార్త మీ కోసమే...

LIC Policy: మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి మంచి లాభాలు సంపాదించాలంటే ఈ వార్త మీ కోసమే. వాస్తవానికి LIC ప్రతి అన్ని వర్గాల ప్రజలకి పాలసీలను అందిస్తుంది. ఈ క్రమంలో LICకి ఒక ప్రత్యేక పాలసీ ఉంది. దీనిపేరు జీవన్ శిరోమణి ప్లాన్. ఇందులో రక్షణతో పాటు పొదుపు కూడా లభిస్తుంది. ఈ పాలసీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

1 కోటి హామీ మొత్తం

LIC జీవన్ శిరోమణి ప్లాన్ నాన్-లింక్డ్ ప్లాన్. ఈ పాలసీలో కనీస రాబడి కోటి రూపాయలు. ఈ పాలసీని 19 డిసెంబర్ 2017న ప్రారంభించారు. ఇది నాన్-లింక్డ్, పరిమిత ప్రీమియం చెల్లింపు మనీ బ్యాక్ ప్లాన్. ఈ పాలసీ అధికగా సంపాదించే వర్గాలకి అనుకూలంగా ఉంటుంది. ఈ ప్లాన్ కింద క్లిష్టమైన వ్యాధులకు కూడా కవరేజి అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేక ప్లాన్‌లో 3 రైడర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. పాలసీదారుడు రుణం, సర్వైవల్ బెనిఫిట్స్ పొందాలంటే మాత్రం తప్పనిసరిగా నాలుగు సంవత్సరాల కాలపరిమితికి డిపాజిట్స్‌ చేయాల్సి ఉంటుంది.

LIC జీవన్ శిరోమణి ప్లాన్ పాలసీదారునికి టర్మ్ సమయంలో డెత్ బెనిఫిట్ రూపంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పాలసీలో మెచ్యూరిటీపై ఒకేసారి మొత్తం కూడా అందిస్తారు. ఈపాలసీలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే పాలసీ వ్యవధిలో, కస్టమర్‌లు వారి సరెండర్ విలువ ఆధారంగా రుణం తీసుకోవచ్చు. LIC నిబంధనలు, షరతులు దీనికి వర్తిస్తాయి. పాలసీ లోన్ ఎప్పటికప్పుడు నిర్ణయించిన వడ్డీ రేటుకు ఇస్తారు.

14 సంవత్సరాల పాలసీకి సంబంధించి.. పదో సంవత్సరంలో అలాగే పన్నెండో ఏడాది పూర్తయినప్పుడు బేసిక్ సమ్ అష్యూర్డ్‌ నుంచి 30శాతం పొందే వీలుంటుంది. అలాగే 16 సంవత్సరాల పాలసీకి సంబంధించి.. 12వ సంవత్సరం అలాగే 14 సంవత్సరాల సమయంలో 35శాతం సమ్ అష్యూర్డ్‌ నుంచి పొందొచ్చు. అలాగే 18 సంవత్సరాల పాలసీకి సంబంధించి... 14వ ఏట, అలాగే 16 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సమ్ అష్యూర్డ్‌ నుంచి 40శాతం పొందొచ్చు. ఇక 20 సంవత్సరాల పాలసీకి సంబంధించి అయితే 16, 18 ఏళ్లు పూర్తయ్యే క్రమంలో 45 శాతం బేసిక్ సమ్ అష్యూర్డ్‌ నుంచి పొందొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories