Sundar Pichai Salary Hike: గూగుల్ బాస్‌కు కళ్లు చెదిరే శాలరీ.. సత్య నాదెళ్ల, టిమ్ కుక్‌లను దాటేసి పిచాయ్!

Sundar Pichai Salary Hike
x

Sundar Pichai Salary Hike: గూగుల్ బాస్‌కు కళ్లు చెదిరే శాలరీ.. సత్య నాదెళ్ల, టిమ్ కుక్‌లను దాటేసి పిచాయ్!

Highlights

Sundar Pichai Salary Hike: గూగుల్ బాస్ సుందర్ పిచాయ్‌కు కళ్లు చెదిరే జీతం. రాబోయే మూడేళ్లకు రూ. 63,618 కోట్ల ($692 మిలియన్లు) భారీ ప్యాకేజీని ప్రకటించిన ఆల్ఫాబెట్. సత్య నాదెళ్ల, టిమ్ కుక్‌లను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందే సీఈఓగా పిచాయ్ రికార్డు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చదవండి.

Sundar Pichai Salary Hike: భారత సంతతికి చెందిన గూగుల్ (ఆల్ఫాబెట్) సీఈవో సుందర్ పిచాయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. రాబోయే మూడేళ్ల కాలానికి ఆయన జీతాన్ని $692 మిలియన్లకు (సుమారు రూ. 63,618 కోట్లు) పెంచుతూ ఆల్ఫాబెట్ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌లలో పిచాయ్ అగ్రస్థానంలో నిలిచారు.

ఆ భారీ ప్యాకేజీ లెక్కలివే..

పలు నివేదిక ప్రకారం.. ఈ ప్యాకేజీ కేవలం నగదు రూపంలోనే కాకుండా కంపెనీ పనితీరు, షేర్ల రూపంలో విభజించారు.

వార్షిక జీతం: $2 మిలియన్లు (సుమారు రూ. 18.5 కోట్లు).

పనితీరు స్టాక్ యూనిట్లు (PSUs): $126 మిలియన్ల విలువైన షేర్లు. ఒకవేళ కంపెనీ లక్ష్యాలను మించి రాణిస్తే ఇది $252 మిలియన్లకు రెట్టింపు అవుతుంది.

నెలవారీ ఆదాయం: మూడేళ్ల పాటు నెలకు $84 మిలియన్ల విలువైన షేర్లు ఆయన ఖాతాలో చేరతాయి.

ఫ్యూచర్ ఇన్సెంటివ్స్: అటానమస్ వెంచర్స్ (Waymo), డ్రోన్ డెలివరీ (Wing) వృద్ధికి అనుగుణంగా అదనంగా $350 మిలియన్ల వరకు స్టాక్ ప్రోత్సాహకాలు అందనున్నాయి.

జీతాల రేసులో ఏ కంపెనీ సీఈఓ ఎక్కడ ఉన్నాడంటే..?

2025-26 అంచనా ప్రకారం ఏడాది సంపాదన సుమారుగా.. సుందర్ పిచాయ్ - గూగుల్ (ఆల్ఫాబెట్)$230 మిలియన్లు, సత్య నాదెళ్ల - మైక్రోసాఫ్ట్$96.5 మిలియన్లు, టిమ్ కుక్ - ఆపిల్$74.3 మిలియన్లు..

పిచాయ్ హయాంలో గూగుల్..

2015లో పిచాయ్ సీఈవో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గూగుల్ మార్కెట్ విలువ కళ్లు చెదిరే రీతిలో పెరిగింది. 2015లో మార్కెట్ విలువ $535 బిలియన్లుగా ఉంటే, ప్రస్తుత మార్కెట్ విలువ $3.6 ట్రిలియన్లు (ఈ ఏడాది జనవరిలో ఇది $4 ట్రిలియన్ల మార్కును కూడా తాకింది). అంటే ఆయన నాయకత్వంలో గూగుల్ విలువ దాదాపు 7 రెట్లు పెరిగింది. అందుకే బోర్డు ఆయనపై ఇంతటి నమ్మకాన్ని ఉంచింది. ప్రస్తుతం సుందర్ పిచాయ్ దంపతుల వద్ద 1.67 మిలియన్ల గూగుల్ షేర్లు ఉన్నాయి. వీటి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు $498 మిలియన్లు (రూ. 4,500 కోట్లకు పైగా). 2004లో గూగుల్‌లో సాధారణ ఉద్యోగిగా చేరిన పిచాయ్.. క్రోమ్, ఆండ్రాయిడ్ వంటి విప్లవాత్మక ఉత్పత్తులతో సంస్థను అగ్రపథాన నిలిపి నేడు ఈ స్థాయికి ఎదిగారు. గూగుల్ అటానమస్ కార్ల విభాగం 'వేమో', డెలివరీ డ్రోన్స్ 'వింగ్' వంటి భవిష్యత్తు ప్రాజెక్టుల బాధ్యతను కూడా పిచాయ్ భుజానికెత్తుకోవడంతో ఆయన విలువ టెక్ ప్రపంచంలో అమాంతం పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories