Karnataka: బికినీపై క‌న్న‌డ‌ జెండా.. అమెజాన్‌పై కన్నడిగులు ఫైర్‌

Karnataka Flag in Bikini
x

అమెజాన్‌ (Thehansindia)

Highlights

Karnataka: అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గ‌జ సంస్థ‌ అమెజాన్‌ కన్నడిగుల ఆగ్రహానికి గురైంది.

Karnataka: అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గ‌జ సంస్థ‌ అమెజాన్‌ కన్నడిగుల ఆగ్రహానికి గురైంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన‌ జెండా రంగులు, చిహ్నంతో కూడిన బికినీని విక్రయించినందుకు గానూ ఈ వివాదంలో చిక్కుకుంది. అమెజాన్‌కు చెందిన కెనడా వెబ్‌సైట్‌లో ఈ తరహా బికినీ వెలుగుచూడడం ఈ వివాదానికి కారణం. బికినీ వ్యవహారంపై కర్ణాటక మంత్రి అరవింద్‌ లింబావాలీ తీవ్రంగా స్పందించారు. కర్ణాటక ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ విషయంలో అమెజాన్‌ కెనడా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అరవింద్‌ లింబావాలీ హెచ్చరించారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకుండా మల్టీ నేషనల్‌ కంపెనీలు చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సైతం అమెజాన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. దీంతో జెండా రంగులు, చిహ్నంతో కూడిన బికినీని మాత్రం తన సైట్‌ నుంచి తొలగించింది. మొన్న వికారమైన భాషగా కన్నడను పేర్కొనడంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న గూగుల్‌ ఉదంతం మరవకముందే ఈ వ్యవహారం వెలుగుచూడడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories