Stock Markets: వరుస నష్టాలకు బ్రేక్‌.. ఆరు రోజుల తర్వాత లాభాల్లోకి స్టాక్‌ మార్కెట్స్‌

Stock Markets Sensex Breaks 6 Day Losing Streak Soars 634 Pts Nifty Above 19000
x

Stock Markets: వరుస నష్టాలకు బ్రేక్‌.. ఆరు రోజుల తర్వాత లాభాల్లోకి స్టాక్‌ మార్కెట్స్‌

Highlights

Stock Markets: సెన్సెక్స్ 634, నిఫ్టీ 190 పాయింట్ల లాభం

Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరు రోజుల తర్వాత కోలుకున్నాయి. శుక్రవారం బలంగా పుంజుకున్నాయి. సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు రోజంతా అదే జోరు కొనసాగించాయి. మార్కెట్లకు అమ్మకాల సెగ తగల్లేదు. కార్పొరేట్ ఫలితాలు సానుకూలంగా ఉండటం మార్కెట్లకు కలిసి వచ్చింది. ఆసియా, ఐరోపా మార్కెట్లలోని సానుకూలతలు సూచీలకు అండగా నిలిచాయి. సెన్సెక్స్ 63వేల 559 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 63వేల 913 వద్ద గరిష్టాన్ని , 63వేల 393 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది.

చివరకు 634 పాయింట్ల లాభంతో 63వేల 782 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18వేల 928 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 18వేల 926 నుండి 19వేల076 మధ్య కదలాడింది. చివరకు 190 పాయింట్లు లాభపడి 19వేల 047 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.24 వద్ద నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories