స్టాక్ మార్కెట్లు డీలా.. మరింత బలపడిన రూపాయి!

స్టాక్ మార్కెట్లు డీలా.. మరింత బలపడిన రూపాయి!
x
Representational Image
Highlights

దూసుకు పోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కొంచెం డీలా పడ్డాయి. కొద్దిరోజులుగా పరుగులు పెడుతున్న మార్కెట్లు ఈరోజు మిశ్రమంగా కదిలాయి. ఆర్బీఐ...

దూసుకు పోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కొంచెం డీలా పడ్డాయి. కొద్దిరోజులుగా పరుగులు పెడుతున్న మార్కెట్లు ఈరోజు మిశ్రమంగా కదిలాయి. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు మార్కెట్ మీద ఎమట్టం ప్రభావం చూపించలేదు.

ఈ ఉదయం (మార్చి 27) స్టాక్ మార్కెట్లు పరుగులు తీస్తూనే ప్రారంభం అయ్యాయి. ఇంత్రాదేక్స్ లో 1179 పాయింట్లు లాభపడి 31,000 మార్క్ దాటింది. అదే విధంగా నిఫ్టీ కూడా 9000 పాయింట్లు పైకెగసింది. అయితే, ఆర్బీఐ ప్రకటన తరువాత పరిస్థితి మారిపోయింది. ఆర్బీఐ నిర్ణయాలతో సూచీలు కిందకు కదిలాయి. ఆఖరుకు సెన్సెక్స్ 131 పాయింట్ల నష్టంతో 29,816 పాయింట్ల వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 8,660 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.

- నిఫ్టీలో కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, ఎన్‌టీపీసీ, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. కోల్ ఇండియా 6 శాతానికి పైగా పెరిగింది.

- ఇక బజాజ్ ఫైనాన్స్, హీరో మోటొకార్ప్, ఇండస్ఇండ్ బ్యాంక్, గెయిల్, మారుతీ సుజుకీ షేర్లు నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్ 8 శాతం కుప్పకూలింది.

- నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2 శాతానికి పైగా పడిపోయింది. నిఫ్టీ రియల్టీ కూడా నష్టపోయింది. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 1 శాతం క్షీణించింది. ఇక మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి.

- మరోవైపు అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి భారీగా లాభపడింది. ఏకంగా 33 పైసలు లాభంతో 74.82 వద్ద కదలాడుతోంది.

- అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు మిశ్రమంగా కదిలాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.99 శాతం తగ్గుదలతో 26.06 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.18 శాతం పెరుగుదలతో 22.64 డాలర్లకు పెరిగింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories