Stock Market: వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Markets Ended In Gains For The Fifth Day In A Row
x

Stock Market: వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Highlights

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి.

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. వరుసగా ఐదో సెషన్లో కూడా లాభపడ్డాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు ఒడిదుడుకులకు గురైనప్పటికీ...మధ్యాహ్నం నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 385 పాయింట్లు లాభపడి 66వేల 265కి పెరిగింది. నిఫ్టీ 116 పాయింట్లు పుంజుకుని 19వేల 727 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, విప్రో షేర్లు లాభాల్లో ముగిశాయి. సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories