కుదేలైన స్టాక్ మార్కెట్లు..భారీ నష్టాల్లోకి ట్రేడింగ్‌లో సూచీలు

కుదేలైన స్టాక్ మార్కెట్లు..భారీ నష్టాల్లోకి ట్రేడింగ్‌లో సూచీలు
x
Highlights

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ తదుపరి కోత ఇప్పట్లో ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం...

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ తదుపరి కోత ఇప్పట్లో ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతోపాటు ఎస్.బ్యాంకు, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు కుదేలయ్యాయి. విదేశీ పెట్టుబడులు నిరంతరంగా వెనక్కి మరలడంతో మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. ట్రేడింగ్‌లో సూచీలు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా పతనమైంది. నిఫ్టీ 10,720 దిగువకు ట్రేడ్ అవుతోంది. చమురు ధరలు పెరుగుదల ఇప్పటికే మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. మధ్యాహ్నం ప్రాంతంలో సెన్సెక్స్ 419 పాయింట్ల నష్టంతో 36,145 వద్ద నిఫ్టీ 125 పాయింట్ల నష్టంతో 10,715 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.18గా కొనసాగుతోంది. ఎస్ బ్యాంకు షేర్లు 10శాతం నష్టాల్లో ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories