Stock Market: భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

Stock Market Trading at Huge Losses
x

Stock Market: భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

Highlights

Stock Market: 550 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్‌, 180 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు, GDP అంచనాలను అందుకోలేకపోవడం సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా మార్కెట్‌లు వరుసగా నాలుగోరోజు నష్టాలతో ముగిశాయి. ఇవాళ ఆసియా మార్కెట్లు సైతం ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య 550 పాయింట్ల భారీ నష్టంతో 59వేల వద్ద సెన్సెక్స్ ట్రేడవుతోంది. నిఫ్టీ 180 పాయింట్లు నష్టపోయి 17వేల 600 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 79రూపాయల 65పైసల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ITC లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్‌, TCS, ICICI బ్యాంక్‌, HDFC బ్యాంక్‌, రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా, HCL టెక్‌ షేర్లు అత్యధికంగా నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories