Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి.

Arun Chilukuri
Updated on: 6 Oct 2022 7:15 PM IST
Stock Market Today Sensex Gains Over 150 Points, Nifty50 Settles Above 17300 at Close
X

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య మన సూచీలు రాణించాయి. రూపాయి బలహీనపడటం, రష్యాపై ఐరోపా సమాఖ్య మరిన్ని ఆంక్షల్ని ప్రకటించిన నేపథ్యంలో లాభాలు పరిమితమయ్యాయి. 58వేల 314.05 దగ్గర లాభాలతో ప్రారంభమై సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 58వేల 578.76 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. చివరకు 156.63 పాయింట్ల లాభంతో 58వేల 222.10 వద్ద స్థిరపడింది. 17వేల 379.25 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టిన నిఫ్టీ 17వేల 428.80 దగ్గర గరిష్ఠాన్ని తాకి చివరకు 57.50 పాయింట్ల లాభంతో 17వేల 331.80 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి 81రూపాయిల 90పైసల దగ్గర నిలిచింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story