భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market Today 13 Sept 2022 | Business Updates
x

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Highlights

456 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. 134 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ఐదు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. గత ఆగస్ట్ నెల తర్వాత గరిష్ట స్థాయులను తాకాయి. అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ద్రవ్యోల్బంణం పెరిగినట్టు నిన్న గణాంకాలు వెలువడినప్పటికీ... అంతర్జాతీయ సానుకూలతలు మదుపరులు కలవరాన్ని అధిగమించేలా చేశాయి. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 456 పాయింట్లు లాభపడి 60,571కి చేరుకుంది. నిఫ్టీ 134 పాయింట్లు పెరిగి 18,070 వద్ద స్థిరపడింది. ఆటో, ఎనర్జీ, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు మినహా అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories