Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్‌ సూచీలు

Stock Market  Ends With Marginal Gains
x

Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్‌ సూచీలు

Highlights

Stock Market: సెన్సెక్స్ 104.99, నిఫ్టీ 32.35 పాయింట్లు గెయిన్

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్‌ సహా యూకే, జపాన్‌ కేంద్ర బ్యాంకులు ఈ వారమే నిర్ణయాలు తీసుకోనున్న నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సూచీలు రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. అయితే రిలయన్స్‌, టాటా స్టీల్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌లో కొనుగోళ్ల మద్దతు కారణంగా సూచీలు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి.

ఉదయం 72,587.30 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం 12 గంటల వరకు లాభనష్టాల మధ్య కదలాడింది. ఆ తర్వాత కాస్త కోలుకుని ఇంట్రాడేలో 72,985.89 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 104.99 పాయింట్ల లాభంతో 72,748.42 వద్ద ముగిసింది. నిఫ్టీ 32.35 పాయింట్ల లాభంతో 22,055 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.90గా ఉంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, సన్‌ఫార్మా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టైటాన్‌, విప్రో, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 85.98 డాలర్ల ఎగువన కొనసాగుతోంది. బంగారం ఔన్సు 2159 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బిట్‌కాయిన్‌ మళ్లీ 67వేల స్థాయికి చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories