నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
x
Stock market (File photo)
Highlights

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను కరోనా భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా బాధితులతో ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. దేశీయ స్టాక్...

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను కరోనా భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా బాధితులతో ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మళ్లీ నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం ట్రెడింగ్ ఆరంభంలో నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో లాభపడి మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 810 పాయింట్లు నష్టపోయి.. 30వేల 579 వద్ద ముగిసింది. నిఫ్టీ 230 పాయింట్లు నష్టపోయి 8వేల 967 వద్ద ముగిసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories