స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త! రుణాల వడ్డీరేట్లకు బెంచ్ మార్క్ గా ఆర్‌బీఐ రేపో రేటు

స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త! రుణాల వడ్డీరేట్లకు బెంచ్ మార్క్ గా ఆర్‌బీఐ రేపో రేటు
x
Highlights

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శుభవార్త మోసుకొచ్చింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రేపో రేటును తాను జారీచేసే రుణాలకు ఎక్స్‌టర్నల్ బెంచ్‌‌మార్క్‌ గా తీసుకోవాలని నిర్ణయించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శుభవార్త మోసుకొచ్చింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రేపో రేటును తాను జారీచేసే రుణాలకు ఎక్స్‌టర్నల్ బెంచ్‌‌మార్క్‌ గా తీసుకోవాలని నిర్ణయించింది. ఫ్లోటింగ్ రేటు ఎంఎస్ఎంఈ రుణాలు, హోమ్ లోన్స్, రిటైల్ రుణాలకు ఇది వర్తిస్తుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ అమలులోకి వస్తుంది.

బ్యాంకుల వడ్డీ రేట్లను నియంత్రించడానికి ఆర్‌బీఐ ఇటీవల కొన్ని సూచనలు చేసింది. వాటిలో ముఖ్యమైనది రుణాలపై వడ్డీ రేటుకు బెంచ్ మార్క్ నిర్ణయించుకోవడం. దీని ప్రకారం బ్యాంకులు ఆర్‌బీఐ రెపో రేటు, ఫైనాన్షియల్ బెంచ్‌మార్క్స్ ఇండియా (ఎఫ్‌బీఐఎల్) ప్రకటించే భారత ప్రభుత్వ 3 నెలల ట్రెజరీ బిల్ ఈల్డ్, ఎఫ్‌బీఐఎల్ పబ్లిష్ చేసే భారత ప్రభుత్వ ఆరు నెలల ట్రెజరీ బిల్ ఈల్డ్, లేదంటే ఎఫ్‌బీఐఎల్ ప్రకటించే ఇతర బెంచ్‌మార్క్ మార్కెట్ వడ్డీ రేటు ప్రాతిపదికన బ్యాంకులు కస్టమర్లకు రుణాలు జారీ చేయొచ్చు. ఈ బెంచ్‌మార్క్స్‌లో తమకు నచ్చినదానిని బ్యాంకులు ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. దీనివలన ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రెపో రేటు తగ్గినప్పుడు రుణ రేట్లు కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. ఈ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణల జారీ విధానాన్ని వాలంటరీ ప్రాతిపదికన ఇప్పుడు ఎస్‌బీఐ కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఇది కేవలం ఎంఎస్ఎంఈలకు మాత్రమే వర్తిస్తుంది. సూక్ష్మ, స్థూల మధ్యతరహా పరిశ్రమలకు రుణ సదుపాయాన్ని అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ బ్యాంక్ తెలిపింది. ఈ నిర్ణయం 2019 అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories