Business Idea: రూ.5 వేల పెట్టుబడితో అదిరే బిజినెస్‌.. ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తుంది..!

Start PM Janaushadhi Kendra with Government Support Check for all Details
x

Business Idea: రూ.5 వేల పెట్టుబడితో అదిరే బిజినెస్‌.. ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తుంది..!

Highlights

Business Idea: కొంతమందికి ఉద్యోగం చేయడం అంటే ఇష్టం ఉండదు. చిన్నదైనా పర్వాలేదు కానీ సొంత వ్యాపారం ఉండాలని కోరుకుంటారు.

Business Idea: కొంతమందికి ఉద్యోగం చేయడం అంటే ఇష్టం ఉండదు. చిన్నదైనా పర్వాలేదు కానీ సొంత వ్యాపారం ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారికి ఈ బిజినెస్‌ బాగా సెట్‌ అవుతుంది. అంతేకాదు పెట్టుబడి తక్కువే ఉంటుంది కానీ లాభాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా ప్రభుత్వం నుంచి సహకారం కూడా లభిస్తుంది. ఒకరి కింద ఉద్యోగం చేయటం కంటే టెన్షన్ లేకుండా సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇది సరైన అవకాశమని చెప్పాలి. ఇంతకీ ఈ బిజినెస్‌ ఏంటంటే 'ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రం' ఏర్పాటు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలి అలాగే పేదవారికి తక్కువ ధరలో మందులు అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రం' లని తీసుకొచ్చింది. ఈ మెడికల్‌ షాపులు సక్సెస్‌ కావడంతో అనేక చోట్ల ఈ షాపులు తెరుస్తున్నారు. ఇటీవల కేంద్రం కొత్తగా 2000 స్టోర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వీటిలో 1,000 కేంద్రాలు ఆగస్టు 2023 నాటికి, మిగిలినవి డిసెంబర్ చివరినాటికి ఓపెన్‌ అవుతాయి. 1800 రకాల మందులు, 285 వైద్య పరికరాలను బయటి కంటే 50 నుంచి 90 శాతం వరకు తగ్గింపు ధరలకు లభిస్తాయి.

మీరు నివసిస్తున్న ప్రాంతంలో ఈ మెడికల్‌ షాపుని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకోసం రూ.5000లతో ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అలాగే బీ-ఫార్మసీ లేదా డీ-ఫార్మసీ పాస్‌ అయి ఉండాలి. షాపు ఏర్పాటుకు 120 చదరపు అడుగుల స్థలం ఉండాలి. మెడికల్‌ షాపు తెరచిన తర్వాత రూ.5 లక్షల వరకు లేదా నెలకు గరిష్ఠంగా రూ.15 వేలను ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తుంది. అలాగే నెలవారీ మందుల కొనుగోళ్లపై 15 శాతం ఇన్సెంటివ్ లభిస్తుంది.

అలాగే ప్రత్యేక కేటగిరీలు లేదా ప్రాంతాల్లో అవస్థాపన ఖర్చులకు రీయింబర్స్‌మెంట్‌గా ప్రభుత్వం అదనపు ప్రోత్సాహక మొత్తంగా రూ.2 లక్షలను ఒకేసారి అందజేస్తుంది. ఈ దుకాణం ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోవటానికి ఆధార్ కార్డ్, ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్, నివాస ధృవీకరణ పత్రం కావాలి. janaushadhi.gov.in అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి PM జన్ ఔషధి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories