SIM Active Plans: ఒక్కసారి రీచార్జ్ చేస్తే నంబర్ యాక్టివ్‌గానే ఉంటుంది!

SIM Active Plans: ఒక్కసారి రీచార్జ్ చేస్తే నంబర్ యాక్టివ్‌గానే ఉంటుంది!
x

SIM Active Plans: ఒక్కసారి రీచార్జ్ చేస్తే నంబర్ యాక్టివ్‌గానే ఉంటుంది!

Highlights

ఇప్పుడు చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ మొబైల్ నంబర్లు ఉంటున్నాయి. టారిఫ్ ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రతి నంబర్‌కు విడివిడిగా రీచార్జ్ చేయడం ఖర్చుతో కూడుకున్న విషయం.

ఇప్పుడు చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ మొబైల్ నంబర్లు ఉంటున్నాయి. టారిఫ్ ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రతి నంబర్‌కు విడివిడిగా రీచార్జ్ చేయడం ఖర్చుతో కూడుకున్న విషయం. ముఖ్యంగా రెండో నంబర్‌ను అప్పుడప్పుడు మాత్రమే వాడతారనుకుంటే, దాన్ని యాక్టివ్‌గా ఉంచుకోవడం కోసం తక్కువ ఖర్చుతో వచ్చే ప్లాన్‌ల కోసం చాలామంది వెతుకుతున్నారు.

ఈ నేపథ్యంలో డేటా అవసరం లేని యూజర్ల కోసం, వారి సిమ్ నంబర్ యాక్టివ్‌గా ఉండేలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లు తీసుకురావాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశించడంతో Airtel, Jio, Vi వంటి ప్రముఖ టెలికాం సంస్థలు తమ డేటా-రహిత ప్లాన్‌లను మార్కెట్‌లో విడుదల చేశాయి. అవేంటో ఓసారి చూద్దాం…

Airtel డేటా లేని ప్లాన్‌లు:

₹469 ప్లాన్:

Validity: 84 రోజులు

Benefits: అపరిమిత కాల్స్, ఉచిత రోమింగ్, 900 SMSలు

₹1849 ప్లాన్:

Validity: 365 రోజులు

Benefits: అపరిమిత కాల్స్, ఉచిత రోమింగ్, 3600 SMSలు

Jio లాంగ్ వాలిడిటీ ప్లాన్‌లు:

₹448 ప్లాన్:

Validity: 84 రోజులు

Benefits: అపరిమిత కాల్స్, 1000 SMSలు

₹1748 ప్లాన్:

Validity: 336 రోజులు

Benefits: అపరిమిత కాల్స్, 3600 SMSలు

Vodafone Idea (Vi) ప్లాన్‌లు:

₹470 ప్లాన్:

Validity: 84 రోజులు

Benefits: అపరిమిత కాల్స్, SMSలు

₹1849 ప్లాన్:

Validity: 365 రోజులు

Benefits: అపరిమిత కాల్స్, SMSలు

ఈ మూడు టెలికాం సంస్థల డేటా-రహిత ప్లాన్‌లు ఫోన్ నంబర్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి చక్కటి ఎంపికలుగా నిలుస్తున్నాయి. మీరు ఎక్కువగా కాల్స్, మెసేజ్‌లకే ఉపయోగిస్తుంటే.. ఈ ప్లాన్‌లు మీ ఖర్చును బాగా తగ్గించడమే కాక, సిమ్ పనిచేస్తూ ఉండేందుకు సహాయపడతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories